Begin typing your search above and press return to search.

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ పై హ‌త్యాయ‌త్నం

By:  Tupaki Desk   |   20 July 2019 10:12 AM GMT
జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ పై హ‌త్యాయ‌త్నం
X
ఈటీవీలో జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో పాపుల‌రైన వినోద్ పై హ‌త్యా య‌త్నం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్ కాచీగూడ ప‌రిస‌రాల్లో వినోద్ పై కొంద‌రు దుండ‌గులు దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. అయితే త‌న‌పై ఇంటి య‌జ‌మాని హ‌త్యాయ‌త్నం చేశార‌ని వినోద్ ఆరోపించారు. ప్ర‌స్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును విచారిస్తున్నారు.

కాచిగూడ‌లో జ‌రిగిన ఎటాక్ లో వినోద్ కంటికి గాయం అయ్యింది. వినోద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించి కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు ఎటాక్ కి కార‌కుల‌పై ఆరాలు తీస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ ఈ త‌ర‌హా వివాదాల్లోకి రావ‌డం ఇదే తొలి సారి కాదు. ఇంత‌కుముందు త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అప్పుడు కుటుంబ స‌భ్యులే పెళ్లికి బ‌ల‌వంతం చేశార‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి. తాజాగా అత‌డిపై దుండ‌గులు హ‌త్యా య‌త్నం చేయ‌డంతో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

వినోద్ జ‌బ‌ర్ధ‌స్త్ షోలో లేడి గెటప్పుల‌తో ఫేమ‌స్ అయ్యారు. ఇప్ప‌టికీ బిజీ ఆర్టిస్టుగానే కొన‌సాగుతున్నారు. ఇంత‌కీ త‌న‌పై ఇంటి య‌జ‌మానినే హ‌త్యా య‌త్నానికి ప్ర‌య‌త్నించ‌డం వెన‌క కార‌ణ‌మేంటో తెలియ‌రావ‌డం లేదు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి విభేధాలు ఉన్నాయి? అన్న‌దానిపైనా పోలీసులు దృష్టి సారించార‌ట‌. ప్ర‌స్తుతం ఇన్వెస్టిగేష‌న్ సాగుతోంది.