Begin typing your search above and press return to search.

తమిళ బిగ్ బాస్ లో ఖుషీ భామ

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:41 AM GMT
తమిళ బిగ్ బాస్ లో ఖుషీ భామ
X
తెలుగులో బిగ్ బాస్2 ప్రారంభమై ఇప్పటికే రెండు వీకెండ్స్ గడిచిపోయాయి. ఇక్కడ నాని హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ పై ఇప్పటివరకూ పెద్దగా పాజిటివ్ రిపోర్టులేమీ లేవు. అటు నాని హోస్టింగ్ విషయంలో అయినా.. ఇటు పార్టిసిపెంట్స్ విషయంలో అయినా.. అంతగా ఆకట్టుకున్న వైనం కనిపించడం లేదు.

అయితే.. తమిళ బిగ్ బాస్2కి మాత్రం.. గతేడాది హోస్ట్ చేసిన కమల్ హాసన్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నారు. ఈ సీజన్ కోసం సెట్ చేసిన పార్టిసిపెంట్స్ లిస్ట్ గొప్పగా ఏమీ లేదు కానీ.. కొత్తమ్మాయి అయినా గతేడాది ఒవియా ఎంతటి సెన్సేషన్ అయిందో తెలిసిందే. తమిళ్ బిగ్ బాస్2 పార్టిసిపెంట్స్ లో ఓ ఇద్దరి పేర్లు మాత్రం మనకు బాగా దగ్గరే. మొత్తం 12 మంది లిస్ట్ లో ఒకరు ముంతాజ్. ఖుషీ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన కనిపించిన కోలీవుడ్ బ్యూటీ ముంతాజ్.. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

ఇక పొన్నాంబళం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారీ విగ్రహం కలిగిన ఈయన.. ఎన్ని సినిమాల్లో తన విలనిజం చూపించాడో మనకు తెలుసు. రజినీకాంత్.. చిరంజీవి.. వెంకటేష్.. ఇలా దాదాపు ప్రతీ ఒక్క స్టార్ హీరోతోను ఫైట్ చేసిన ఈయనకు.. కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్ గా ఉంటుంది. కోలీవుడ్ బిగ్ బాస్2 సెలబ్రిటీ లిస్ట్ లో మనకు బాగా పరిచయం ఉన్న మొహాలు మాత్రం ఈ రెండే.