Begin typing your search above and press return to search.

ముమైత్ మరీ అంతకు దిగజారిందా?

By:  Tupaki Desk   |   28 May 2016 6:42 AM GMT
ముమైత్ మరీ అంతకు దిగజారిందా?
X
టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు మళ్లీ కలరింగ్, జోష్ తీసుకొచ్చిన భామ ముమైత్ ఖాన్. పోకిరిలో 'ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే' అంటూ ముమైత్ వేసిన చిందులను ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత ఈ భామ స్థాయి ఓ రేంజ్ కి చేరిపోయింది. ముమైత్ తో తో ఓ ఐటెం సాంగ్ చేయించడం ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఐటెం భామలుగా చిందులేయడానికి దిగిపోవడంతో.. వీళ్ల పరిస్థితి దిగజారిపోయింది.

ముఖ్యంగా ముమైత్ ఖాన్ పరిస్థితి అయితే మరీ ఘోరం. రీసెంట్ విశాఖ పట్నం జిల్లా భీమిలీ మండలం చిప్పాడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతరలో.. రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో ముమైత్ ఖాన్ డ్యాన్సులే స్పెషల్ అట్రాక్షన్. ఓ ఈవెంట్ లో ఐటెం గాళ్ డ్యాన్సులు చేయడం వింత కాదు కానీ.. టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం పుచ్చుకున్న ముమైత్.. ఇలా రికార్డింగ్ డ్యాన్సుల స్థాయికి దిగిపోవడమే బాధాకరం.

సినిమాల్లో ఐటెం పాటల్లో నటిస్తూ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు అనిపించుకున్న ముమైత్ పరిస్థితి.. ఇప్పుడు చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. ఎంత డబ్బుల కోసం అయితే మాత్రం మరీ ఇంతగా రికార్డింగ్ డ్యాన్సులు వేయడమేంటని ప్రశ్నిస్తున్న వాళ్లకు.. అసలు ఇందుకు కారణాలు మాత్రం ఆలోచించడం లేదు.