Begin typing your search above and press return to search.

కన్నడ గోపాలుడి ట్రైలర్ చూశారా?

By:  Tupaki Desk   |   27 Oct 2016 9:17 AM GMT
కన్నడ గోపాలుడి ట్రైలర్ చూశారా?
X
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వెంకటేష్ చేసిన మరో మల్టీస్టారర్ మూవీ గోపాలా గోపాలా. ఈ సినిమా కమర్షియల్ విజయం సంగతి కాసేపుపక్కనపెడితే... వెండితెరపై ఇద్దరు స్టార్ హీరోలను చూసిన ఆనందం మాత్రం మరోసారి తెలుగు ప్రేక్షకులకు దక్కింది. ఈ క్రమంలో తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన ఈ గోపాల గోపాల చిత్రాన్ని "ముకుందా మురారి" పేరుతో కన్నడంలోకి రీమేక్ చేశారు.

కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్, ఉపేంద్రలు ఈ చిత్రంలో నటించారు. "గోపాల గోపాల" చిత్రంలో పవన్ పోషించిన గాడ్ గోపాల్ పాత్రలో సుదీప్ కనిపిస్తుండగా, వెంకీ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. దేవుడిపై నమ్మకం లేని నాస్తికుని పాత్రకు ఉపేంద్ర కంటే బెస్ట్ ఛాయిస్ మరెవరూ లభించలేదట సుదీప్‌కి.. అలాంటి పాత్రల్లో ఉపేంద్ర సూపర్ అని అంటున్నాడు. అయితే ఈ మధ్యనే చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది!!

కాగా, బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో "గోపాల గోపాల" చిత్రంగా రీమేక్ చేశారు దర్శకుడు డాలి. ఈ సినిమాలో పవన్ కృష్ణుడిగా కనిపించగా, వెంకటేష్ ఆయన భక్తుడి పాత్రలో కనిపించి అలరించారు. అయితే గోపాల గోపాల చిత్రంను రీమేక్ చేయాలని భావించిన సుదీప్ కన్నడ వర్షెన్‌కు ముకుందా మురారి అనే టైటిల్‌ ఫెరఫెక్ట్ యాప్ట్ అని భావించారు. అయితే... తెలుగులో పవన్ చేసిన పాత్రలంటే సుదీప్ కి చాలా ఇష్టమో ఏమో కానీ... గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని కూడా సుదీప్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గోపాల గోపాల సినిమాలో పవన్ వాడే బైక్ కూడా అప్పట్లో ఫుల్ ఫేమస్. అయితే ఈ ముకుందా మురారి కి కూడా అదే బైకి వాడారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/