Begin typing your search above and press return to search.

ఫోటో జ‌ర్న‌లిస్ట్ ల‌వ్‌ లో రాక్ష‌సి

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:13 AM GMT
ఫోటో జ‌ర్న‌లిస్ట్ ల‌వ్‌ లో రాక్ష‌సి
X
వైవిధ్య‌మైన స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ వ‌రుస‌గా బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొడుతున్నాడు నిఖిల్. కార్తికేయ‌ - సూర్య వ‌ర్సెస్ సూర్య‌ - ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా? .. ఇవ‌న్నీ ఇమేజ్ చ‌ట్రంలో చిక్కుకోకుండా అత‌డి సెల‌క్ష‌న్‌ కి - అభిరుచికి ఎగ్జాంపుల్‌ గా నిలిచిన చిత్రాలు. అడ‌పాద‌డ‌పా ఫ్లాపులు ఎదురైనా కెరీర్ ప‌రంగా అత‌డికి ఇప్ప‌ట్లో డోఖా ఏం లేదు. ప్ర‌స్తుతం అత‌డు మ‌రో డిఫ‌రెంట్ స్క్రిప్టుని ఎంపిక చేసుకుని అభిమానుల్ని అల‌రించేందుకు వ‌స్తున్నాడు. నిఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `ముద్ర` లేటుగా వ‌చ్చినా లేటెస్టుగానే వ‌స్తోంద‌ని తాజాగా రిలీజైన‌ ఫ‌స్ట్ లుక్ చెబుతోంది. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విప‌త్క‌ర స‌న్నివేశాల్ని మీడియా ఎలా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే ముద్ర చిత్రీక‌ర‌ణ‌ చివ‌రిద‌శ‌లో ఉంది. ఏక‌కాలంలో డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేస్తున్నారు. తొలిసారి కెరీర్ జ‌ర్నీలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌డి బ‌ర్త్ డే కానుగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. నిఖిల్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రం పాత్ర‌లో న‌టిస్తున్నారు. అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో ఆ ఇద్ద‌రూ జ‌ర్న‌లిస్టులు గానే న‌టిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఫోటో జ‌ర్న‌లిస్టు అయిన క‌థానాయ‌కుడితో ప్రేమ‌లో ప‌డే యాంక‌ర్ కం జ‌ర్న‌లిస్టుగా లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రొమాన్స్ - కెమిస్ట్రీ ప‌క్కాగానే కుదిరింద‌ని పోస్ట‌ర్ చెబుతోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణ‌ముర‌ళి - నాగినీడు - ప్ర‌గ‌తి తదిత‌రులు న‌టించారు. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి - మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్‌ పి సంస్థ‌ల‌పై బి మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో కావ్య‌ వేణుగోపాల్ - రాజ్ కుమార్ ముద్ర నిర్మిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా ముద్ర సినిమాపై ర‌క‌ర‌కాలుగా నెగెటివిటీతో ప్ర‌చారం సాగుతోంది. ఈ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాలంటే నిఖిల్ స‌క్సెస్‌ తోనే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 28న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ఇంకో 50రోజులే నిఖిల్‌ కి మిగిలి ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట‌యిన‌ట్టే ఇక‌!!