వీడియో టాక్: శ్రీయ గ్లామర్ కట్ చేశారా?

Wed Jan 11 2017 12:05:15 GMT+0530 (IST)

ఇప్పుడు 'మృగనయనా' అంటూ ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడిన పాట వీడియో ఒకటి ఇంటర్నెట్లో నానా హంగామా చేస్తోంది. ఈ పాట నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ''గౌతమిపుత్ర శాతకర్ణి''లోది. అయితే మొన్నామధ్యన కేవలం వీడియో మేకింగ్ విడుదల చేశారు కాని.. ఇప్పుడు వీడియో టీజర్ కూడా విడుదల చేశారు. ఇంతకీ ఈ పాట ఎలా ఉంది?

ఆ సెట్టింగులు కాని.. తన భార్యతో సరససల్లాపీలు సాగిస్తున్న మహారాజు శాతకర్ణిగా బాలయ్య కాని.. వావ్ అనిపంచేలా ఉన్నారు. ఈ పాటలో శ్రీయ తన అందచందాలను విపరీతంగా దారపోస్తుందని మొన్నటివరకు ఒక అంచనా ఉండేది. అయితే ఈ పాటలో చూస్తే మాత్రం.. శ్రీయ మాత్రం మరీ గ్లామరసం అయితే దారబోయలేదని ఇట్టే అర్ధమవుతోంది. నాభి అందాలను ఆరబొయ్యడం.. ఇతర ఒంపుసొంపులతో తాయిలాలు ఇవ్వడం వంటివి చేయనే చేయలేదు. ఇంతలా శ్రీయ గ్లామర్ డోస్ ఎందుకు కట్ చేశారనే సందేహం ఎవరికైనా వచ్చేస్తోంది.

ఈ సినిమాలో శ్రీయ శాతకర్ణి పిల్లలకు తల్లిగా.. ఒక పెళ్ళయిన రాణి పాత్రలో కనిపిస్తోంది కాబట్టి.. అంతగా గ్లామర్ డోస్ ఉంటే బాగోదని తలచిన డైరక్టర్ క్రిష్ ఇలా గ్లామర్ డోస్ ను కట్ చేయించాడని టాక్.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/