Begin typing your search above and press return to search.

మోగ్లీ వస్తున్నాడు.. టాలీవుడ్ బహుపరాక్

By:  Tupaki Desk   |   8 Feb 2016 3:30 PM GMT
మోగ్లీ వస్తున్నాడు.. టాలీవుడ్ బహుపరాక్
X
హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ తీసే చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. గతంలో ఈ సంస్థ జంగిల్ బుక్ అంటూ ఓ యానిమేషన్ మూవీతో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఇప్పుడు ఇదే స్టోరీతో రియల్ లైఫ్ కేరక్టర్లతో ఓ సినిమా తీస్తోంది. మోగ్లీ అంటూ తీస్తున్న చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు వాల్ట్ డిస్నీ ప్రకటించింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన మోగ్లీ ట్రైలర్ ను.. ఇప్పటివరకూ 2 కోట్ల మంది చూశారంటే.. ఈమూవీకి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. నీల్ సేథి మోగ్లీగా నటిస్తుండగా అతనికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న మోగ్లీ.. ఈ ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేయడంతో.. టాలీవుడ్ జనాలు బెంగ పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాల్ట్ డిస్నీ నుంచి వచ్చే చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడీ మోగ్లీ సమ్మర్‌ లో వస్తున్నాడంటే.. ఖచ్చితంగా అది ఇండియన్‌ సినిమాలకు పెద్ద దెబ్బే. ముఖ్యంగా మన టాలీవుడ్ పై ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

అవతార్‌ రేంజులో మోగ్లీ ఆడుతుందేమో అని సినీ జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సీజన్‌ లోనే మన దగ్గర రిలీజ్ అయ్యేందుకు బోలెడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్‌ గబ్బర్ సింగ్ - అల్లు అర్జున్ సరైనోడు మూవీస్ అయితే.. అదే సమయంలో థియేటర్స్ లో ఉంటాయి. ఈ మోగ్లీ ఎఫెక్ట్ టాలీవుడ్ భారీ చిత్రాలపై థియేటర్స్, కలెక్షన్స్ రూపంలో ఖచ్చితంగా పడుతుందని అంచనా.