Begin typing your search above and press return to search.

కాజల్ గ్లామర్ కు ఎక్కువ మార్కులే

By:  Tupaki Desk   |   21 March 2018 10:25 AM GMT
కాజల్ గ్లామర్ కు ఎక్కువ మార్కులే
X
సరిగ్గా పదకొండేళ్ల క్రితం వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాలో కనిపించిన కాజల్ అగర్వాల్ - కళ్యాణ్ రామ్ జంట మళ్లీ ఇప్పుడు తెరపై అలరించడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్టవ్వలేదు గాని ఇద్దరి కెమిస్ట్రీని దర్శకుడు తేజా బాగా చూపించాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు దర్శకుడు ఉపేంద్ర కూడా తన తొలి దర్శకత్వంలోనే వారిని అందుకు బిన్నంగా కొత్తగా చూపించేస్తున్నాడు.

కాజల్ - కళ్యాణ్ రామ్ జోడి ఎమ్మెల్యే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోంది. అయితే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ తో అంచనాలను పెంచుతోంది. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆ సినిమాలోని మోస్ట్ వాంటెడ్ అబ్బాయి అనే పాట అందరిని ఆకట్టుకుంటోంది. పాటలో కాజల్ అందమే హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. మూడు పదుల వయసు వచ్చినా కూడా అమ్మడు ఇచ్చిన గ్లామర్ షో మాములుగా లేదు.

నాభి అందాలని మోడ్రన్ డ్రెస్సుల్లో సరికొత్తగా చూపిస్తూ.. సెక్సీ ఆహావభావాలను ప్రదర్శించింది. కాజల్ కత్తిలా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా కాజల్ సినిమాలో ఎప్పుడు కనిపించని విధమైన క్యారెక్టర్ తో కనిపిస్తుందని చెబుతున్నారు. పాటను చూస్తుంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో గాని కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతారని తెలుస్తోంది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి