Begin typing your search above and press return to search.

యూట్యూబ్ లో టాప్ 3 తెలుగు పాటలివే!

By:  Tupaki Desk   |   20 Oct 2016 6:01 AM GMT
యూట్యూబ్ లో టాప్ 3 తెలుగు పాటలివే!
X
యూట్యూబ్ లో శ్రీమంతుడు పాటలకు సంబందించి ఒక రికార్డు తాజాగా వార్తల్లో నిలిచింది. జూలై 18 - 2015 న అంటే దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా యూట్యూబ్ లో వినటంతో ఈ అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యిందని ప్రకటించారు. దీంతో ఈ లిస్ట్ లో ఇప్పటివరకూ తెలుగు సినిమా పాటల రికార్డులపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టాప్ త్రీ లో ఉన్న మూడు తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విషయంలో సినిమా మొదలైనప్పటి నుంచీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న "బాహుబలి" సినిమా.. ఈ యూట్యూబ్ పాటల విషయంలోనూ టాప్ ప్లేస్ లో నిలిచింది. జూన్ 13 - 2015 న యూట్యూబ్ లో విడుదలయిన ఈ పాటలకూ ఇప్పటివరకూ 94లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఈ విషయంలో కూడా బాహుబలి మొదటిస్థానంలో ఉంది. కీరవాణి అందించిన స్వీట్ మ్యూజిక్ ఈ రికార్డును సొంతం చేసుకుంది.

ఆ తర్వాతి స్థానంలో ముందుగా ప్రకటించినట్లుగానే సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా నిలిచింది. ఈ సినిమా పాటలు కూడా యూట్యూబ్ లో 2015లోనే విడుదలయ్యాయి. వీటికి కూడా 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమా వసూళ్ల పరంగా కూడా బాహుబలి తర్వాత స్థానాన్ని ఆక్రమించిన ఈ సినిమా యూట్యూబ్ పాటల వ్యూస్ విషయంలో కూడా అదే స్థానాన్న నిలిచింది.

ఇప్పుడు మూడోస్థానంలో నిలిచింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "సన్నాఫ్ సత్యమూర్తి". మార్చి 15 - 2016న యూట్యూబ్ లో విడుదలయిన ఈ పాటలు ఇప్పటివరకూ సుమారు 79 లక్షలకు పైగా వ్యూస్ సాధించి మూడోస్థానంలో కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో శ్రీమంతుడుకి - సన్నాఫ్ సత్యమూర్తి కి అతితక్కువ గ్యాప్ మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే యూట్యూబ్ పాటల విషయంలో ఈ రెండింటి మద్య రసవత్తరమైన పోరు సాగుతుందనే అనుకోవాలి!

అయితే ఈ మూడు టాప్ సినిమాల్లో బాహుబలికి సంగీతం కీరవాణి అందించగా... మిగిలిన రెండు సినిమాలకూ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాదే సంగీతం సమకూర్చారు. దేవీశ్రీ ప్రాటలకు నేటి యూత్ లో ఉన్న ఆసక్తికి దీన్ని ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/