Begin typing your search above and press return to search.

2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది?

By:  Tupaki Desk   |   25 Sep 2018 5:30 PM GMT
2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది?
X
2018-19 సీజ‌న్‌ లో డ‌జ‌ను పైగానే భారీ బ‌డ్జెట్‌ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. వీటిలో ఐదు సినిమాలు మాత్రం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌విగా క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాల‌న్నీ ఫిక్ష‌న్ జోడించిన క‌థ‌ల‌తో సూప‌ర్‌ హీరో త‌ర‌హాలో హాలీవుడ్ రేంజులో హై ఎండ్ టెక్నాల‌జీ బేస్ చేసుకుని ప్లాన్ చేసిన‌వే. వాస్త‌విక క‌థ‌ల‌కు లార్జ‌ర్ దేన్ లైఫ్ యాటిట్యూడ్‌ ని పాత్ర‌ల‌కు ఆపాదిస్తే పుట్టుకొచ్చే విజువ‌ల్ గ్లింప్స్ ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇవ‌న్నీ క‌ళ్ల‌కు మిరుమిట్లు గొల‌ప‌డం ఖాయం. బాహుబ‌లి సిరీస్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత‌ మారిన ట్రెండ్‌ లో చేస్తున్న ప్ర‌య‌త్నాలే ఇవ‌న్నీ.

సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ -అక్ష‌య్‌- శంక‌ర్ కాంబినేష‌న్ మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ (నవంబ‌ర్ 2018 రిలీజ్‌) దాదాపు 300-400 కోట్ల బ‌డ్జెట్‌ తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. అలానే ప్ర‌భాస్ - సుజీత్- యువి క్రియేష‌న్స్ సినిమా `సాహో`(స‌మ్మ‌ర్ 2019 రిలీజ్‌) సుమారు రూ.150-225 కోట్ల బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి - సురేంద‌ర్ రెడ్డి- రామ్‌ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి 150-200 కోట్ల మేర వెచ్చిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. `సైరా`(స‌మ్మ‌ర్ 2019 రిలీజ్‌)ను నాన్న‌కు కానుక‌గా ఇస్తున్నాం. అన్‌ లిమిటెడ్ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. వీటితో పాటు బాలీవుడ్ నుంచి అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కుతున్న చిత్రాలుగా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్(న‌వంబ‌ర్ 2018 రిలీజ్‌) - జీరో (డిసెంబ‌ర్ 2018 రిలీజ్‌) చిత్రాలు పాపులారిటీ అందుకున్నాయి. అమీర్‌ ఖాన్‌- అమితాబ్ బ‌చ్చ‌న్‌- క‌త్రిన‌ కైఫ్ వంటి భారీ తారాగ‌ణంతో `ధూమ్ 3` ఫేం విజ‌య్‌ కృష్ణ ఆచార్య చేస్తున్న ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మిది. `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` బ‌డ్జెట్ ఎంత‌? అంటే ఇండియాస్ నంబ‌ర్ వ‌న్ బ‌డ్జెట్ అంటూ య‌శ్‌ రాజ్ ఫిలింస్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాకి 200 - 300 కోట్ల మేర ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఓ అంచ‌నా. ఇక కింగ్ ఖాన్ షారూక్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న జీరో చిత్రానికి ట్యాలెంటెడ్ ఆనంద్.ఎల్.రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ (షారూక్ పారితోషికం లేకుండా-సొంత బ్యాన‌ర్‌ లో) ఖ‌ర్చు చేస్తున్నార‌ని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాల ఫ‌స్ట్‌ లుక్‌ లు వ‌చ్చి ఆక‌ట్టుకున్నాయి. 2.ఓ -సైఫై టెక్న‌లాజిక‌ల్ సినిమా - సాహో- భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ - థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ - బందిపోటు దొంగ‌ల నేప‌థ్యం ఉన్న సినిమా - సైరా -న‌ర‌సింహారెడ్డి - స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు - గ్రేట్ వారియ‌ర్‌ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ - జీరో - మ‌రుగుజ్జు క‌థ‌ - షారూక్‌ కొత్త ఎటెంప్ట్ చేస్తూ - త్రిపాత్రాభిన‌యం అద‌ర‌గొట్టేస్తాడ‌న్న టాక్ ఉంది. అందుకే ఈ సినిమాల‌న్నీ 2018-19 సీజ‌న్‌ లో అత్యంత క్రేజీ చిత్రాలుగా మార్మోగిపోతున్నాయి. అయితే వీటిలో ఏ సినిమా బెస్ట్? అన్న‌దానిపై ప్రేక్ష‌కాభిమానులే అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ వేటిక‌వే ప్ర‌త్యేక‌త ఉన్న క‌థ‌ల‌తో - భారీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో తెర‌కెక్కుతున్న చిత్రాలు. వంద‌ల కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకోగ‌లిగే - వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్‌ కి రెడీ అవుతున్న యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టు ఉన్న చిత్రాలుగా ప్ర‌చార‌మ‌వుతోంది.