Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఎక్కువైన మనీబ్యాక్ స్కీమ్స్

By:  Tupaki Desk   |   27 May 2016 5:22 AM GMT
టాలీవుడ్ లో ఎక్కువైన మనీబ్యాక్ స్కీమ్స్
X
ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా సక్సెస్ లు - ఫెయిల్యూర్స్ రెండూ తప్పవు. తీసిని అన్ని సినిమాలు సక్సెస్ అయిపోయే పరిస్థితి కూడా ఉండదు. హిట్ పర్సంటేజ్ ఎప్పుడు 10నుంచి 15 శాతాన్ని కూడా మించదు. సినీ రంగంలో ప్రతీ ఒక్కరికీ ఈ విషయం బాగానే తెలుసు. కానీ ఫ్లాపులు వచ్చినపుడు కొంత వరకు నష్టాలను భరించేందుకు అందరూ సిద్ధమే. డిజాస్టర్ల విషయంలో భారీ నష్టాలు వచ్చినపుడే పరిస్థిత చేజారుతూ ఉంటుంది. పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను కాంపెన్సేట్ చేయమని అడిగే పరిస్థితి తలెత్తుంది.

అప్పట్లో నందమూరి బాలకృష్ణ నటించిన ఒక్క మగాడుకు భారీ నష్టాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు.. నష్టాలను రీపే చేయాలంటు నిరాహార దీక్షలు కూడా చేశారు. సాధారణంగా ఒక సినిమాకి పెట్టిన పెట్టుబడిపై 20శాతానికి మించి నష్టం వస్తే.. తిరిగి చెల్లించాలనే డిమాండ్ ఏర్పడుతుంది. ఈ సమ్మర్ ప్రారంభంలో విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. అయితే.. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో నష్టాలు రాలేదు. నష్టపోయిన వాళ్లకు మాత్ర తమ తర్వాతి చిత్రంతో కాంపెన్సేట్ చేస్తాననే హామీ పవన్ కళ్యాణ్ తో పాటు, నిర్మాణ సంస్థ ఈరోస్ నుంచి కూడా వచ్చింది.

ఇప్పుడు మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాంబినేషన్లు - భారీ కాస్టింగ్ - ఫ్యామిలీ జోనర్ కారణంగా ఎక్కువ రేట్లకే ఈ సినిమాని అమ్మారు. కానీ చాలా ఏరియాల్లో భారీ నష్టాలు వచ్చే పరిస్థితి. ముఖ్యంగా నైజాం - ఓవర్సీస్ లో ఇన్వెస్ట్ మెంట్ లో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్లకు నిర్మాత నుంచి నష్టాలను తిరిగి చెల్లిస్తామనే హామీ లభించినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే తన రెమ్యూనరేషన్ లో కొంత వెనక్కి ఇస్తానని నిర్మాతకు మహేష్ చెప్పాడని అంటున్నారు. గతంలో ఆగడు విషయంలో మహేష్ ఇలాగే చేశాడు.