మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్ చూశారా

Tue Apr 17 2018 14:04:06 GMT+0530 (IST)

అందరి హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చేశారు. రానా రామ్ చరణ్ నాగచైతన్య ఈ తరం హీరోలుగా హిట్ ఎంట్రీ కొట్టారు. తండ్రుల్లాగే నిలదొక్కుకున్నారు. ఇక మిగిలిపోయింది బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. టీనేజీ వయసు దాటడంతోనే ఆ హీరో ఎంట్రీని నందమూరి అభిమానులు కోరుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య కూడా కొడుకును బంపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయాలని భావించారు. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమన్నారు. కానీ తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటోను చూస్తే మోక్షజ్ఞ ఇప్పట్లో సినిమాలు చేయడేమో అని అనిపించకమానదు.యువ హీరోలంతా సన్నగా కరెంటు తీగలాగే ఉంటున్నారు. లావుగా ఉండే హీరోల తరం కాదిది. అంతెందుకు మొదట్లో బొద్దుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ కూడా కర్రలా సన్నగా మారిపోయాడు. సో... ఇప్పుడు వచ్చే ఏ కొత్త హీరోలైనా అలా ఉంటేనే ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. మరి మోక్షజ్ఞ అలా లేడే. బాలయ్య రెండో కూతురు తేజస్వినికి ఆ మధ్య బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ శుభసందర్భంలో కుటుంబసభ్యులంతా వేడుక చేసుకుని ఓ ఫోటో తీసుకున్నారు. అందులో మోక్షజ్ఞ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లా కనిపించారు. ఆ పిల్లగాడు ఊహించని దాని కంటే లావుగా ఉండడంతో నందమూరి అభిమానులు ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది కూడా ఎంట్రీ లేనట్టేనన్నమాట అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లుక్ పరంగా హీరోలకుండాల్సిన లక్షణాలు మోక్షజ్ఞలో ఇంకా కనిపించడం లేదు. ఆ బాడీని చూస్తుంటే జిమ్ కు వెళ్తున్నట్టు అనిపించడం లేదు. బాలయ్యేమో గతేడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడంటూ సన్నిహితుల దగ్గర చెప్పారని టాక్. మరి మోక్షజ్ఞ చూస్తే ఇంకా సినిమాకు లుక్ పరంగా సిద్దమవ్వలేదు. దీనిని బట్టి ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే అని భావిస్తున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.