Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: మోక్షజ్ఞ న్యూ లుక్

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:50 AM GMT
వైరల్ పిక్: మోక్షజ్ఞ న్యూ లుక్
X
నెపోటిజం అని ఇంగ్లీష్ లో అనండి.. బంధుప్రీతి అని తెలుగులో అనండి.. ఆ టాపిక్ పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన ప్రేక్షకులకు స్టార్ కిడ్స్ అంటే మాత్రం అమితాసక్తి ఉంటుంది. అసలు ఇప్పుడు టాలీవుడ్ లో ఉండే స్టార్ల లిస్టు తీస్తే ఎంతమంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు అనేది మనకు తెలుస్తుంది. అందుకే స్టార్ కిడ్ అనగానే అందరి దృష్టి వారిపైకి వెళ్తుంది. అక్కినేని అఖిల్ తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఎంట్రీ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞదే.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలారోజుల నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇప్పటివరకూ బాలయ్య ఈ వైపునుండి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పై స్పష్టత రాలేదు. కొన్ని నెలల క్రితం చబ్బీగా కనిపించిన మోక్షజ్ఞను చూసి అభిమానులు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. కానీ తాజాగా మోక్షజ్ఞ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది బాలయ్య తనయుడి లేటెస్ట్ పిక్ అని అంటున్నారు. ఈ ఫోటోలో మోక్షజ్ఞ ఫిట్ గానే కాకుండా స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాడు. లైట్ గా గడ్డం పెంచి.. కళ్ళజోడు ధరించి ఉన్న లుక్ లో మోక్షజ్ఞను చూస్తే త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఖాయమేనని అనిపిస్తోంది.

బాలయ్య తనయుడిగా హీరో ఎంట్రీ ఇవ్వడం సులువే గానీ ఈ జెనరేషన్ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే అఖిల్ లాంటి స్టార్ కిడ్స్ ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మరి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.