Begin typing your search above and press return to search.

అప్పుడు విజయ్.. ఇప్పుడు హృతిక్‌..

By:  Tupaki Desk   |   25 July 2016 5:30 PM GMT
అప్పుడు విజయ్.. ఇప్పుడు హృతిక్‌..
X
ఒక ప్యాట్రన్ లో సినిమా వచ్చి హిట్టయితే.. అదే ప్యాట్రన్లో ఇంకొన్ని దించేయడం మనకు అలవాటే. మనం అంటే కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. బాలీవుడ్‌ కూడా అలాగే తగలడింది. పైగా ఇప్పుడు అందరికీ బాహుబలి ప్యాట్రన్ లో ఉతికి ఆరేశేయాలనే కోరిక పెద్దదైంది.

''పులి'' అంటూ ఓ గొప్ప సినిమా చేశాడు విజయ్‌. ఇప్పుడు హృతిక్‌ చేస్తున్న ''మొహంజొదారో'' సినిమా కూడా అలాగే కనిపిస్తోంది. పీరియడ్ బ్యాక్ డ్రాపుతో సినిమాలు తీస్తే జనాలకు తెగ నచ్చేస్తాయనో లేకపోతే వందల కోట్లలో కలక్షన్లు వసూలు చేయడం సునాయసంగా జరిగిపోతుందని అనుకుంటారో తెలియదు కాని.. వీళ్ళు చేస్తున్న ఈ సినిమాలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటున్నాయి. ''బాహుబలి'' సినిమాను కొట్టే స్థాయి అంటూ ఊహించి ''పులి'' చేస్తే.. అందులో కంటెంట్ చేసిన కామెడీ మామూలుగా లేదు. నాలుగు హాలీవుడ్ సినిమాలను డైరక్టుగా కలిపేసుకుని తీసిన ఒక పేలవమైన ఫిలిం టైపులో మిగిలిపోయింది. ఇప్పుడు ''మొహంజొదారో'' పాటల వీడియోలను చూస్తుంటే.. మనోళ్ళు రామోజీ ఫిలిం సిటీలో ఏదో ఆఫ్రికన్‌ కంట్రీ మార్కెట్‌ సెట్టింగ్‌ వేసి సినిమాను తీసినట్లుంది తప్పిస్తే.. నిజంగానే వేల సంవత్సరాల క్రితం నాటి మనుషల చరిత్రను చూసినట్లు లేదు.

చరిత్రను వక్రీకరిస్తూ.. ప్రీ-హిస్టారిక్ సమయంలో కూడా సెక్సీగా బట్టలు.. మోడ్రన్ డ్యాన్సు స్టెప్పులు.. పంచ్ డైలాగులూ.. ఏందయ్యా మీ అతి? దీనికి అంతేలేదా?