Begin typing your search above and press return to search.

ఆకాశవాణిలో మన్యం పులి?

By:  Tupaki Desk   |   15 Dec 2018 8:35 AM GMT
ఆకాశవాణిలో మన్యం పులి?
X
రాజమౌళి వారసుడిగా కాక తనకంటూ స్వంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న కార్తికేయ దర్శకుడిగా ఆకాశవాణి ద్వారా డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆ మధ్య విడుదల చేసారు. వివాహం ఉన్నందుకు రెగ్యులర్ షూటింగ్ ని ఇంకా మొదలుపెట్టలేదు కార్తికేయ. ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో విలన్ పాత్ర కోసం పెద్ద కసరత్తే జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. దాని కోసం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని సంప్రదించబోతున్నట్టు తెలిసింది. నిజానికి ముందు దీనికి అనుకున్న ఛాయస్ రవి శంకర్.

కానీ హీరోయిక్ ఇమేజ్ ఉన్న విలన్ అయితేనే బాగా ఎలివేట్ అవుతుందని గుర్తించి ఆ ఐడియా డ్రాప్ అయ్యారట. ముందే బడ్జెట్ పరిమితుల్లో ఉండాలని అనుకోవడంతో మోహన్ లాల్ పేరు తొలుత పరిశీలనలోకి రాలేదు. ఒకవేళ ఆయన ఓకే అంటే ఎలాగూ కేరళ మార్కెట్ వస్తుంది కాబట్టి ఖర్చు ఎక్కువైనా ఈజీగా వర్క్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మోహన్ లాల్ నో అంటే దానికి ప్రత్యాన్మయంగా రాజశేఖర్ ని సంప్రదించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇది తేలడానికి ఓ నెల రోజులకు పైగా టైం పట్టే అవకాశం ఉంది.

మోహన్ లాల్ తెలుగులో చేసిన జనతా గ్యారేజ్-మనమంతా వల్ల మంచి గుర్తింపు వచ్చింది. మన్యం పులి కమర్షియల్ గా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో ఆకాశవాణిలో చేస్తే ఖచ్చితంగా బ్రాండ్ వేల్యూ పెరుగుతుంది. మరో లాల్ ఓకే చెప్తాడా లేదా అనేదే ఇప్పుడు అసలు సస్పెన్స్. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన కార్తికేయ కాస్టింగ్ ని ఫైనల్ చేయడంతో పాటు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.