మరో హిట్ మూవీ వదుల్తున్న సూపర్ స్టార్

Thu Jan 12 2017 09:12:57 GMT+0530 (IST)

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గతేడాది వరుస హిట్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఒప్పం అంటూ ఓ గుడ్డివాడి పాత్రలో మోహన్ లాల్ చేసిన పాత్రకు కేరళ జనాలు నీరాజనాలు పలికేశారు. ఇప్పుడా ఒప్పం మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. కేరళలో చాలానే రికార్డులను బద్దలు కొట్టేసింది.

కేరళలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒప్పం.. తెలుగులో కనుపాప పేరుతో రిలీజ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉంటుంది. పుట్టు గుడ్డివాడి పాత్రలో కనిపించే మోహన్ లాల్.. ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. అయితే.. ఆ అపార్ట్ మెంట్ లో ఓ హత్య జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎస్కేప్ అయిపోతాడు. అతడిని మోహన్ లాల్ ఎలా పట్టుకోగలిగాడు అన్నదే ఒప్పం మూవీ కథ. ఈ చిత్రంలో ఓ చిన్నారి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. బేబీ మీనాక్షి అనే అమ్మాయి ఈ రోల్ ను చేసింది.

తెలుగులో ఈ కనుపాప చిత్రానికి ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 25న జరపనుండగా.. ఫిబ్రవరి 3న మూవీ రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని దిలీప్ కుమార్ బొలుగోటి సమర్పిస్తుండగా.. నిర్మాతగా మోహన్ లాన్ వ్యవహరిస్తుండడం విశేషం. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో.. ఇక్కడ కూడా ఒప్పం డబ్బింగ్ మూవీ కనుపాపకు మంచి ఆదరణ లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/