Begin typing your search above and press return to search.

క్రెడిట్‌ తమిళ్‌ బాబులదే కదా సార్‌

By:  Tupaki Desk   |   2 Sep 2015 10:59 PM GMT
క్రెడిట్‌ తమిళ్‌ బాబులదే కదా సార్‌
X
సెప్టెంబర్ 4న రిలీజ్ కు మంచు విష్ణు డైనమైట్ రెడీ అయింది. దేవ్ కట్టా డైరెక్షన్ ఈ మూవీ పై మంచు ఫ్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అయితే... ఈచిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుందంటున్నారు మోహన్ బాబు. నిజానికి తమిళ చిత్రం రిమ నంబి కి డైనమైట్ రీమేక్. అయినా సేమ్ టు సేమ్ తీయలేదని, రీమేక్ అనే ఫీలింగ్ ఎక్కడా రాదంటున్నారు దేవ్ కట్టా.

ఆ సినిమా నుంచి కేవలం కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని డైనమైట్ చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పారాయన. కథ సిద్ధం చేసుకొనేప్పుడు మంచు విష్ణు ఫ్రీడం ఇచ్చారని... అందుకే సొంతం గా కథ రాసుకున్నానంటున్నారు డైరెక్టర్. అలా అయినా సరే... ఒరిజినల్ స్టోరీ తమిళ నేటివిటీ ఉంటుంది కాబట్టి... అలా కాకుండా తెలుగు ప్రేక్షకులకు వీలుగా సన్నివేశాలను కొత్త గా రాసుకుని ఉండొచ్చు. ఇప్పుడు డైనమైట్ ఎంత పెద్ద హిట్ అయినా... ఆ క్రెడిట్ లో మూడొంతులు ఒరిజినల్ మూవీమేకర్స్ కే వెళ్లిపోతుంది. తెలుగు సినిమాగానే చూసినంత మాత్రాన.. ఒరిజినల్ సోల్ తమిళ్ దే కాబట్టి... క్రెడిట్ కూడా వాళ్లకే వస్తుంది.

మరి ఈ చిత్రం తెలుగు సినిమా కి గర్వకారణం అని మోహన్ బాబు చెప్పడం కొంత అతిశయోక్తిగానే ఉంది. అయితే... ఇప్పటివరకూ స్ట్రైట్ మూవీస్ మాత్రమే చేసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ దేవ్ కట్టా... మొదటిసారి ఈ స్టోరీ నచ్చడంతోనే రీమేక్ చేస్తున్నాడు.