Begin typing your search above and press return to search.

క‌న్ఫ‌మ్‌.. ఎన్టీఆర్ సినిమాలో మోహ‌న్ లాల్‌

By:  Tupaki Desk   |   25 Nov 2015 2:11 PM GMT
క‌న్ఫ‌మ్‌.. ఎన్టీఆర్ సినిమాలో మోహ‌న్ లాల్‌
X
తెలుగు తెర‌పై మ‌రో సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ కు రంగం సిద్ధ‌మైంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ క‌లిసి ఒకే సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కబోయే సినిమాలో ఈ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ చూడ‌బోతున్నాం. ఈ వార్త కొన్ని రోజుల కింద‌టే బ‌య‌ట‌కు పొక్కిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న మైత్రి మూవీస్ సంస్థ అధికారికంగా ఎన్టీఆర్‌ - మోహ‌న్ లాల్ కాంబినేష‌న్ గురించి ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

అప్పుడెప్పుడో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన గాండీవం సినిమాలో ఓ పాట‌లో త‌ళుక్కుమ‌న్నాడు మోహ‌న్ లాల్‌. అది కాకుండా తెలుగులో ఓ క్యారెక్ట‌ర్ ఎప్పుడూ చేయ‌లేదు. ఐతే ఇటీవ‌లే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమాలో కీల‌క పాత్ర చేయ‌డానికి అంగీక‌రించాడు మోహ‌న్ లాల్‌. ఇప్పుడు ఎన్టీఆర్ తోనూ సినిమా ఒప్పుకున్నాడు. కొర‌టాల కేర‌ళ‌కు వెళ్లి పూర్తి స్క్రిప్టు వివ‌రించి.. మోహ‌న్ లాల్ పాత్ర గురించి చెప్పి ఆయ‌న్ని ఒప్పించిన‌ట్లు తెలిసింది. గ‌త ఏడాది మోహ‌న్ లాల్‌ త‌మిళంలో విజ‌య్ తో క‌లిసి న‌టించిన జిల్లా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే.