బిగ్ బాస్ కు మన్యం పులి

Tue Apr 17 2018 12:56:29 GMT+0530 (IST)

అవును. బిగ్ బాస్ కు మన్యం పులి రాబోతోంది. కాని గెస్ట్ గా కాదు లెండి హోస్ట్ గా. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో తమిళ్ లో కమల్ హాసన్ తో బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయిన నేపధ్యంలో మలయాళంలో కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. యాంకర్ గా మనకు మన్యం పులి-జనతా గ్యారేజ్ సినిమాల ద్వారా బాగా చేరువైన మోహన్ లాల్ యాంకర్ గా వ్యవహరించబోతున్నట్టు టాక్. కంప్లీట్ యాక్టర్ గా పేరున్న మోహన్ లాల్ అయితేనే ఇమేజ్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని భావించి భారీగా పారితోషికం ముట్టజెప్పి మరీ ఒప్పించినట్టు వినికిడి. ప్రస్తుతం ఇందులో పార్టిసిపెంట్స్ గా ఎవరుండాలి అనే దాని గురించి వేట సాగుతోందట. ఇది విన్నప్పటి నుంచి లాల్ ఫాన్స్ ఆనందం మామూలుగా లేదు. మొదటిసారి తమ స్టార్ ని బుల్లితెరపై చూసుకోవాలని ఎదురు చూస్తున్నారు.మోహన్ లాల్ కు ఎంత ఇచ్చి ఒప్పించారు అనే దాని గురించి సమాచారం లేదు కాని మల్లువుడ్ టీవీ హిస్టరీలో ఎవరికి ఇవ్వని భారీ మొత్తాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తన వారసుడిని కూడా తెరకు పరిచయం చేసిన మోహన్ లాల్ ఈ వయసులో కూడా ఏడాదికి మూడు తక్కువ కాకుండా సినిమాలు చేస్తుండటం విశేషం. తెలుగులో మనమంతా సినిమా కోసం తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్ ఆ తర్వాత జనతా గ్యారేజ్ తో ఇక్కడ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తర్వాత ఆఫర్స్ వచ్చినప్పటికీ అక్కడే బిజీగా ఉండటంతో మళ్ళి చేయలేకపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ కి యాంకరింగ్ అంటే తన యాక్టింగ్ స్కిల్స్ తో రక్తి కట్టిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.