Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కి పెద‌నాన్న పాత్ర‌లో లాల్‌

By:  Tupaki Desk   |   27 Nov 2015 4:57 AM GMT
ఎన్టీఆర్‌ కి పెద‌నాన్న పాత్ర‌లో లాల్‌
X
నాన్న‌తో చెప్పుకోలేనివి పెద‌నాన్న‌తో చెప్పుకోవ‌చ్చంటారు. పెద‌నాన్న తో కొడుకు సాన్నిహిత్యం.. తెలుగు క‌ల్చ‌ర్‌ లో ఆల్వేస్‌ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. కొడుకు చేసిన త‌ప్పుల్ని తండ్రికి తెలియ‌నియ్య‌కుండా కాపు కాచే వాడు పెద‌నాన్న‌.. అని కూడా అంటుంటారు. అందుకే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ మూవీలోకి అనుకోకుండా పెద‌నాన్న వ‌చ్చి చేరాడు. ఈ క్యారెక్ట‌ర్‌ కి చాలా ప్ర‌యారిటీ ఉంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. డీటెయిల్స్‌ లోకి వెళితే..

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే శ్రీ‌మంతుడు ఫేం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు రెడీ అవుతాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే కొర‌టాల ఓ చ‌క్క‌ని క‌థాంశాన్ని రెడీ చేసుకుని సెట్స్‌ కెళ్లేందుకు ప్లాన్ చేశాడు.

ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర‌తో స‌మాన‌మైన ఓ పాత్ర ఉంది. అది జూనియ‌ర్‌ కి పెద‌నాన్న రోల్‌. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా కీల‌క స‌న్నివేశాలు ఉంటాయి. ఎమోష‌న్ పీక్స్‌ లో ఉంటుంది. పెద‌నాన్న‌గా మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్‌ లాల్ కీరోల్ పోషించ‌బోతున్నాడని నిన్న‌టి రోజున ప్ర‌క‌టించింది యూనిట్‌.