Begin typing your search above and press return to search.

టీజర్ కోసం ఇంత చెయ్యాలా?

By:  Tupaki Desk   |   29 May 2017 6:43 AM GMT
టీజర్ కోసం ఇంత చెయ్యాలా?
X
సీనియర్ హీరో శ్రీకాంత్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లయింది. ఆయన హీరోగా నటించే సినిమాల్ని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంన్నర కాలంలో శ్రీకాంత్ ఎన్ని ఫ్లాపులు తిన్నాడో లెక్కల్లో చెప్పడం కష్టం. ఈ మధ్య శ్రీకాంత్ సినిమాలు విడుదలవుతున్న సంగతి కూడా తెలియట్లేదు. కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోకుండా పక్కన పడి ఉన్నాయి. అయినప్పటికీ శ్రీకాంత్ హీరో వేషాలు మాత్రం మానట్లేదు. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ జనాలు అరగదీసేసిన హార్రర్ కామెడీ జానర్లో శ్రీకాంత్ ఒక సినిమా చేశాడు. అదే.. ‘రా..రా..’. ఐతే శ్రీకాంత్ గత సినిమాల్లాగే దీన్నీ జనాలు పట్టించుకోవట్లేదు. దీనికి బిజినెస్ అవ్వట్లేదు.

దీనికి కొంచెం పబ్లిసిటీ హడావుడి చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న శ్రీకాంత్.. ఈ సినిమా టీజర్ ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేతుల మీదుగా రిలీజ్ చేయించడం విశేషం. అలాగని లాల్ హైదరాబాద్ వచ్చాడా అంటే అదేం కాదు. తన భార్య ఊహతో పాటు దర్శక నిర్మాతలు.. కొందరు యూనిట్ సభ్యుల్ని తీసుకుని శ్రీకాంతే కేరళ వెళ్లాడు. మోహన్ లాల్ ఉన్న చోటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించాడు. ఐతే ‘రా..రా..’ టీజర్ చూస్తే మాత్రం సినిమా ఏమీ ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే చాలాసార్లు చూసిన హార్రర్ కామెడీ లాగే ఉంది ఇది కూడా. ఈ టీజర్ కంటే కూడా దీన్ని మోహన్ లాల్ రిలీజ్ చేయడమే చర్చనీయాంశమైంది. త్వరలోనే ‘రా..రా..’ను ప్రేక్షకుల ముందుకు తెస్తారట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/