Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్ లో కూడా కనిపించేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   18 May 2018 11:12 AM GMT
సిక్స్ ప్యాక్ లో కూడా కనిపించేలా ఉన్నాడు
X
కంప్లీట్ యాక్టర్ అనే గుర్తింపు ఒక్క మోహన్ లాల్ కే ఎందుకు వచ్చిందో ఈ ఫొటోతో చెప్పవచ్చు. గత కొంత కాలంగా ఆయన ఫిట్ నెస్ లో చేస్తున్న మార్పులు అందరికి షాక్ ఇస్తున్నాయి. ఎదో 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న హీరో పాత్ర కోసం మారాడు అంటే అందులో అర్థం ఉంది. కానీ తన జీవితంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసి అన్ని ఇండస్ట్రీలలో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ 57 ఏళ్ల వయసులో యువ హీరోలను మరిపిస్తుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరో మూడేళ్లు ఆగితే 60లోకి అడుగుపెట్టే వయసులో కంప్లీట్ యాక్టర్ చేసిన కష్టం ఏమిటో గాని మొత్తంగా మారిపోయాడు. గత రెండేళ్లకు ముందు జనతా గ్యారేజ్ సినిమాలో చబ్బీ లుక్స్ తో ఏ విధంగా ఉండేవాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ సినిమాల్లో కొత్తగా కనిపించాలని చాలా వరకు తన ఫిట్ నెస్ లో మార్పు చేసి ఇప్పుడు నాజూగ్గా రెడీ అయ్యాడు. కుదిరితే సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకునేలా ఉన్నాడు అనే రేంజ్ లో దర్శనం ఇచ్చాడు.

ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఇక రీసెంట్ గా సూర్య తో మల్టీస్టారర్ చేయడానికి కూడా ఈ మలయాళం స్టార్ హీరో ఒప్పేసుకున్నాడు. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాలో టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ కూడా నటించబోతున్నాడు.