మోహన్ బాబు చిలిపి చేష్టలు చూశారా

Mon Jun 19 2017 15:09:53 GMT+0530 (IST)

పేజీల పేజీల డైలాగులు చెప్పడంలో ఆయనకు ఆయనేసాటి. అలాగే కొన్నాళ్ళు బాక్సాఫీస్ ను కూడా తనదైన శైలి సినిమాలతో హీరోగా అలరించేశారు. ఈ మధ్యన సినిమాలు తక్కువగానే చేస్తున్నా కూడా.. ఆయన వాయిస్ మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఈవెంట్లలో గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈయన నిన్న ఫాథర్స్ డే సందర్బంగా చేసిన అల్లరి చేష్టలు.. కాస్త చిలిపిగా అనిపించేశాయి.

నిన్న కొన్ని కారణాల చేత చెన్నయ్ లోని రాజ్ భవన్ కు వెళ్ళారట మోహన్ బాబు. మరి తమిళనాడు గవర్నర్.. తెలుగువారైన విద్యాసాగరరావుతో ఉన్న సాన్నిహిత్యమేమో తెలియదు కాని.. అక్కడ ఆ భవనంలో ఉన్న బ్రిటీష్ కాలం నాటి ఒక భారీ పియానో పై మోహన్ బాబు కళ్లు పడ్డాయి. వెంటనే ఆయన తనలో దాగున్న మొజార్ట్ (సంగీత దిగ్గజాలకే దిగ్గజం)ను బయటకు తీశారని సెలవిచ్చింది మంచు లక్ష్మి. ఆ చిలిపి చేష్టలను ఒక వీడియోలో రికార్డు కూడా చేశారులే. మొత్తానికి మోహన్ బాబు భలే భలే ఎంజాయ్ చేస్తూ.. మనల్ని కూడా ఎంటర్టయిన్ చేస్తున్నారులే.

ఈ మధ్యన తన చిన్న కొడుకు సినిమాల నుండి తప్పుకుంటున్నా అంటూ ట్వీటు చేయడంతో.. అందరూ మోహన్ బాబు కామెంట్స్ ఎలా ఉండోబోతాయో అంటూ ఎదరుచూశారు. ఈలోపు మనోజ్ తన వ్యాఖ్యాలను వెనక్కితీసుకోవడం జరిగింది. ఇప్పుడు మోహన్ బాబు ఇలా ప్రశాంతంగా పియానో వాయిస్తున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/