కలెక్షన్ కింగ్ కౌంటర్లు ఎవరి మీదబ్బా?

Mon Feb 18 2019 15:40:08 GMT+0530 (IST)

నిన్న వైజాగ్ వేదికగా జరిగిన టీఎస్ ఆర్ టీవీ9 నేషనల్ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ తారాతోరణంతో కళకళలాడిపోయింది. వెంకటేష్ తప్ప సీనియర్ అగ్ర హీరోలందరూ తరలి రావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. వచ్చిన అతిధులు క్లుప్తంగానే మాట్లాడినా అందులో అర్ధమయ్యి కానట్టు చాలా అర్థాలు ఉండటంతో కొంత చర్చ రేగిన మాట వాస్తవం. అందులోనూ కలెక్షన్ మోహన్ బాబు విసుర్ల గురించి వేరే చెప్పాలా.తన ప్రసంగంలో టి సుబ్బరామిరెడ్డిని పొగుడుతూ కొందరు కొన్ని పనులు కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చేస్తారని వాళ్ళలో చిత్తశుద్ధి ఉండదని కానీ అదేమీ లేకపోయినా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సుబ్బరామిరెడ్డి ఎప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. స్పీచ్ మొత్తం ఆయన్ని కీర్తించడంతో పాటు దాసరి నారాయణరావు గారిని స్మరించుకోవడానికి వాడుకున్న మోహన్ బాబు ఎన్నికల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

ఎలక్షన్లతో మోహన్ బాబుకు నేరుగా సంబంధ బాంధవ్యాలు లేవు ఆయన ఏ పార్టలోనూ లేరు. అయితే రాజకీయ పరిస్థితుల్లో బయోపిక్ ల గురించి తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో కలెక్షన్ కింగ్ అన్నది వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించా లేక దైవం లాగా భావించే ఎన్టీఆర్ మీద సినిమా తీసి ఫెయిల్ అయిన బాలయ్య గురించా అనే పాయింట్ మీద ఫ్యాన్స్ లో డిస్కషన్ వచ్చింది.

వర్మ లక్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్ లో మోహన్ బాబుని పోలిన వ్యక్తిని చూపించి అతనితో లక్ష్మి పార్వతిని పొగిడించే సీన్ బాగా హై లైట్ అయ్యింది. దాని గురించి బయట ఎక్కడా మాట్లాడని మెహన్ బాబు ఇలా ఈ వేదికను ఉపయోగించుకున్నాడా అనేది అర్థం కాలేదు. ఉద్దేశం ఏదైనా ఇప్పుడున్న సున్నితమైన పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా విశ్లేషణలు జరగడం సహజమే