మోహన్ బాబు రియాక్ట్ అవుతారా?

Thu Feb 14 2019 23:01:27 GMT+0530 (IST)

రామ్ గోపాల్ వర్మ చాలా అరుదుగా మాట మీద నిలబడతారు. గతంలో చాలా సార్లు ఇది ప్రూవ్ అయ్యింది కూడా. డేట్ చెప్పడం ఆ తరువాత మాట మార్చడం పరిపాటిగా మారింది. అయితే లవర్స్ డేకి లక్ష్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేస్తానన్న మాట మాత్రం వర్మ తప్పలేదు. అనుకున్న దాని కన్నా భారీ స్పందన దక్కించుకుని ఒక్క రోజు లోపే మూడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంచితే ఇందులో నిజ జీవిత పాత్రధారులను చూపించిన వర్మ ఎవరు ఏంటి అని వివరాలు చూపకపోయినా గెటప్ ని బట్టి మాటతీరును బట్టి ఈజీగా పోల్చుకునే అవకాశం ఇచ్చాడు.ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోలిన వ్యక్తి లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి కరెక్ట్ గా చెప్పారు అని పొగిడే సీన్ బాగా పేలింది. దీనిని స్క్రీన్ షాట్ గా కట్ చేసి ఒరిజినల్ మోహన్ బాబు అదే గెటప్ లో పాత ఫోటోను కలిపి మేమ్స్ తయారుచేసి అప్పుడే సోషల్ మీడియాలో కూడా వదిలారు. నిజానికి కూడా ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నాక కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే ఈయనే అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్లలో ఒకరని అప్పట్లో కొన్ని కథనాలు వచ్చాయి.

వైస్రాయ్ ఉదంతంలో జరిగిన నాటకీయ పరిణామాల్లో మోహన్ బాబు పాత్ర గురించి చాలా ప్రచారాలు కూడా జరిగాయి. ఎన్టీఆర్ పోకముందే ఈ ఇద్దరికి కొంత కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడిలా లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మోహన్ బాబు ప్రస్తావన నేరుగా చూపించేసారు కాబట్టి మంచు క్యాంప్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు వర్మ ఫ్యాన్స్. అయితే కేవలం ట్రైలర్ కే అటు నుంచి స్పందన రాకపోవచ్చు. పైగా మోహన్ బాబు అనే పేరు పిలవడం కానీ ఉచ్చరించడం కాని జరుగలేదు. సో రిలీజయ్యకే కలెక్షన్ కింగ్ ఆన్సర్ వస్తుందేమో చూద్దాం