ఫోటో స్టోరి: క్రికెట్ కెప్టెన్ ఇరగ్గొట్టేసింది

Sat Jan 13 2018 22:04:48 GMT+0530 (IST)

నేటితరం అమ్మాయిలు ఏ రంగంలో కొనసాగుతున్నా కూడా అందాన్ని మాత్రం అస్సలు మరువడం లేదు. అంతే కాకుండా ఫ్యాషన్ వరల్డ్ లో వారికంటు కొన్ని పేజీలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంతైనా ఒక అమ్మాయికి అందం కూడా కొంచెం మనో ధైర్యాన్ని ఇస్తుందని అంటారు. ఆ తరహాలోనే చాలా మంది మగువలు ఆలోచనలు చేస్తూ అవసరం అయినప్పుడు ఆ ఆయుధాన్ని వదులుతున్నారు.అసలు మ్యాటర్ లోకి వస్తే పైన కనిపిస్తోంది మిథాలి రాజ్ అంటే నమ్మబుద్ది కావడం లేదు కదా!. కానీ నమ్మే తీరాలి. ఆటలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ మగువ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళ క్రికెట్ లో నీకు తెలిసిన ఒక క్రికెటర్ పెరు చెప్పు అని ఎవరినైనా అడిగితే తప్పకుండా మిథాలి రాజ్ అంటారు. అంతగా ఈ మగువ గుర్తింపు పొందింది. కొన్నేళ్లుగా ఇండియన్ వుమెన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న మిథాలి అప్పుడప్పుడు ఇలా ఫ్యాషన్ డ్రెస్సుల్లో మ్యాగజిన్ లపై మెరుస్తోంది.

అసలు ఈ లుక్ లో మిథాలిని చూస్తుంటే పూర్తిగా ఫ్యాషన్ వరల్డ్ లో ఉండే అమ్మాయిలా ఉందే అని అనిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా వినూత్నంగా ఉంది. కానీ బావుంది. మొత్తానికి ఇరగ్గొట్టేసింది అనేలా నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పికాక్ మ్యాగిజిన్ కోసం మిథాలి ఈ విధంగా స్టిల్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఈ వుమెన్ కెప్టెన్ కొన్ని మ్యాగిజిన్ లకు ఫొటో షూట్ ఇచ్చింది కానీ ఈ రేంజ్ లో మాత్రం కనిపించలేదని చెప్పాలి. మరి ముందు ముందు మిథాలి ఇంకెంత కొత్తగా దర్శనం ఇస్తుందో చూడాలి.