Begin typing your search above and press return to search.

మిఠాయి బ్యాచ్ కు ఇంత తొందరెందుకు!

By:  Tupaki Desk   |   23 Feb 2019 10:27 AM GMT
మిఠాయి బ్యాచ్ కు ఇంత తొందరెందుకు!
X
నిన్న ఎన్టీఆర్ మహానాయకుడుతో పాటు విడుదలైన మిఠాయి సినిమా స్టార్లు లేకపోయినా మంచి ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణలు ఉండటంతో యూత్ లో ఓ మోస్తరు అంచనాలతో థియేటర్లలోకి అడుగు పెట్టింది. థియేటర్లు కూడా బాగానే దక్కాయి. పబ్లిసిటీ కూడా చేసుకున్నారు. ముందు రోజు హైదరాబాద్ పివిఆర్ లో స్పెషల్ ప్రీమియర్ షో కూడా వేసారు. అయితే ఇవన్ని పని చేయలేదు. అవుట్ రైట్ డిజాస్టర్ టాక్ తో మిఠాయి బాంబులా పేలిపోయింది.

దీన్ని రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డామని అయినా ఫలితం దక్కలేదని రాహుల్ రామకృష్ణ మెసేజ్ చేసినట్టుగా ఫేస్ బుక్ పోస్ట్ ఒకటి ఇవాళ ఉదయం నుంచి వైరల్ అయ్యింది. సినిమా ఎలాగూ పోతే పోయింది ఇలా అందులో నటించిన వాళ్ళే చెప్పుకుంటే ఎలా అని అతని మీద కామెంట్స్ కూడా వచ్చాయి. డ్యామేజ్ గుర్తించి తీసేసేలోపే అంతా జరిగిపోయింది. స్వయానా లీడ్ యాక్టర్ సినిమా బాలేదు క్షమించండి అంటూ చెప్పాక ఇంక ఎవరు కాపాడుతారు

ఇదంతా జరిగిపోయింది అనుకుంటే ఇవాళ దర్శకుడు ప్రశాంత్ కుమార్ ఒక ఓపెన్ లెటర్ విడుదల చేసాడు. పరాజయానికి పూర్తి బాద్యుడిని తానేనని యూనిట్ కు హిట్ అయితే ఒక పార్టీ ఫెయిల్ అయితే మరో పార్టీ చేసుకుందామని చెప్పానని ఇప్పుడు రెండోదే జరిగిందని ఫెయిల్యూర్ ని ఒప్పేసుకున్నాడు. తనతో ఈ సినిమా కోసం ప్రయాణించిన అందరికి థాంక్స్ చెబుతూ పెద్ద మ్యాటరే చెప్పాడు.

హిట్ అయితే వంద మంది క్రెడిట్ తీసుకుంటారని ఫ్లోప్ అయితే దర్శకుడు ఒక్కడినే బాద్యుడిని చేస్తారని కాని తన విషయంలో కెమెరామెన్ సంగీత దర్శకుడు సౌండ్ ఇంజనీర్ అందరూ పంచుకున్నారని చెప్పాడు. ఇదంతా ఓకే కాని ఇలా పోటీ పడి మరీ ఒకరిని మించి ఒకరు మా సినిమా పోయింది అని ప్రచారం చేసుకుంటే కనీసం వీకెండ్ లో వచ్చే ఆ నలుగు డబ్బులు కూడా చేతులారా పోగొట్టుకుంటున్నట్టు ఉంది. నమ్మి తమ థియేటర్లలో మిఠాయిని వేసుకున్న ఎగ్జిబిటర్లనైనా గుర్తు చేసుకోవాల్సింది