Begin typing your search above and press return to search.

సుసాధ్యమైన అద్భుతం - ట్రైలర్ టాక్

By:  Tupaki Desk   |   18 July 2019 11:50 AM GMT
సుసాధ్యమైన అద్భుతం - ట్రైలర్ టాక్
X
విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకునే అక్షయ్ కుమార్ కొత్త సినిమా మిషన్ మంగళ్ వచ్చే నెల 15న స్వతంత్ర దినోత్సవం నాడు విడుదల కానుంది. ఈ సందర్భంగా దీని ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇండియన్ స్పేస్ హిస్టరీలో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయిన మంగళ్యాన్ శాటిలైట్ ఎపిసోడ్ ను బేస్ చేసుకుని ఇది రూపొందించారు.

మార్స్ గ్రహానికి వెళ్ళే ఉద్దేశంతో సైంటిస్ట్ రాకేశ్ ధావన్(అక్షయ్ కుమార్)ఓ ప్రాజెక్ట్ రూపొందిస్తాడు. 800 కోట్ల ఖర్చుతో దీని మీద పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో పాటు సెంటర్ హెడ్లు భయపడతారు. కాని రాకేశ్ బెస్ట్ టెక్నికల్ టీంని అందులోనూ మహిళలను(తాప్సీ-విద్యా బాలన్-సోనాక్షి సిన్హా-నిత్యా మీనన్-క్రీతి కుల్హరి) సెట్ చేసుకుని అసాధ్యం అనుకున్న దానికి శ్రీకారం చుడతాడు. ఎన్నో అడ్డంకులు సవాళ్ళు. ఆఖరికి చరిత్ర సృష్టిస్తారు

కళ్ళకు కట్టినట్టుగా తీసిన సన్నివేశాలతో సహజత్వం ఉట్టిపడేలా తీసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అందరూ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉండటంతో నిండుతనం తోడయ్యింది. కాస్త రిస్క్ అనిపించే ఇలాంటి సబ్జెక్ట్స్ ని సరైన రీతిలో డీల్ చేయకపోతే డాక్యుమెంటరీలా అనిపిస్తాయి. దర్శకుడు జగన్ శక్తి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

కమర్షియల్ మూవీ కాకపోయినా చూడాలన్న ఆసక్తి రేపడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది. అదే రోజు జాన్ అబ్రహం బాట్లా హౌస్ తో పోటీ పడుతున్న మిషన్ మంగళ్ బడ్జెట్ పరంగ్ కూడా భారీగా రూపొందింది. మహిళా శక్తిని చాటేలా ఉన్న ఈ మూవీ తనకు ప్యాడ్ మ్యాన్-టాయిలెట్-ఎయిర్ లిఫ్ట్ లను మించి పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు అక్షయ్ కుమార్