జూన్ నెలలో మరో హాలీవుడ్ ప్రభంజనం

Thu May 17 2018 17:11:49 GMT+0530 (IST)


హాలీవుడ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యాక్షన్ సినిమాలు. కొన్ని సినిమాల్లో హీరోలు చేసే సాహస సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇక అక్కడి దర్శక నిర్మాతల ధైర్యం ఏమిటో గాని సీక్వెల్స్ పై బలే మోజు పెంచేసుకుంటారు. అద్భుతంగా తెరకెక్కించి వందల కోట్లలో బిజినెస్ చేస్తారు. మొన్నటి వరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క అయితే త్వరలో రాబోయే మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్ సినిమా మరో లెక్క.ఆ సినిమాపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి మిషన్ ఇంపాజిబుల్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోయే కొత్త సీక్వెల్ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఆ విషయం రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా అర్ధమయ్యింది. ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ కనిపించడం ఈ సినిమాలో హైలెట్. న్యూక్లియర్ వార్ నుంచి వరల్డ్ ని ఏ విదంగా రక్షించారు అనేది అసలు కథ.

ఈ సినిమా షూటింగులో టామ్ క్రూజ్ గాయపడ్డారు కూడా. ఓ భవనం పై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా జరుగిన ప్రమాదంలో గాయపడటం అందరినీ భయానికి గురి చేసింది. ఇక ట్రైలర్ లో ఎప్పటిలానే యాక్షన్ సన్నివేశాలు సరికొత్తగా ఉన్నాయని అనిపిస్తోంది. సూపర్‌మ్యాన్ కథానాయకుడు  హెన్రీ కావిల్ కూడా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. మరి ఈ సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ వంటి సినిమాలు దున్నేస్తున్న నేపథ్యంలో.. అలాగే జారసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ కూడా రిలీజవుతున్న వేళ.. ఈ సినిమాల తరువాత మిషన్ ఇంపాజిబుల్: ఫాలవుట్ కూడా రచ్చ చేస్తుందనే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి