Begin typing your search above and press return to search.

మహేష్‌ వర్సెస్‌ టామ్‌ క్రూజ్‌!?

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:10 PM GMT
మహేష్‌ వర్సెస్‌ టామ్‌ క్రూజ్‌!?
X
హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కి మహేష్‌ వీరాభిమాని. కొన్ని స్టయిల్స్‌ లో అతడిని ఇమ్మిటేట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటాడని పరిశీలకులు చెబుతుంటారు. మహేష్‌ కెరీర్‌ ఆరంభంలో వచ్చిన 'వంశీ' చిత్రంలో మిషన్‌ ఇంపాజిబుల్‌ స్టంట్స్‌ కొన్ని కనిపిస్తాయి. అయితే ఇప్పుడు అదే మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌ లో వస్తున్న తాజా చిత్రం శ్రీమంతుడికి పెద్ద థ్రెట్‌ కాబోతోందని విశ్లేషిస్తున్నారంతా.

మహేష్‌ వర్సెస్‌ టామ్‌ క్రూజ్‌.. వివరాల్లోకి వెళితే.. టామ్‌ క్రూజ్‌ నటించిన తాజా చిత్రం 'రోగ్‌ నేషన్‌' (మిషన్‌ ఇంపాజిబుల్‌ 4) ఇటీవలే విదేశాల్లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. టామ్‌ క్రూజ్‌ అసాధారణ పోరాట విన్యాసాలు ఈ సినిమాలో హైలైట్‌ గా ఉన్నాయని టాక్‌ వచ్చింది. తొలి వీకెండ్‌ లో దాదాపు 20మిలియన్‌ డాలర్లను ఈ సినిమా వసూలు చేసింది. టామ్‌ క్రూజ్‌ నటించిన సినిమాల్లోనే టాప్‌ 3 పొజిషన్‌ లో నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా ఇంతవరకూ భారత్‌ లో రిలీజ్‌ కాలేదు. తెలుగు సహా పలు భాషల్లోకి అనువదించి ఇండియాలోనూ రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఈనెల 6న రిలీజ్‌ కి సన్నాహాలు చేస్తున్నారు

అంటే మహేష్‌ శ్రీమంతుడు రిలీజ్‌ కి ఒకరోజు ముందే రోగ్‌ నేషన్‌ రిలీజవుతోంది. ఈ సినిమాకి మినిమం ఆడియెన్‌ ఉంటారు కాబట్టి ఆ మేరకు మహేష్‌ సినిమా ఆరంభ వసూళ్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. వెయిట్‌ అండ్‌ సీ.