Begin typing your search above and press return to search.

ఎన్ని క్ష‌ణాలు వ‌స్తాయి బాసూ...

By:  Tupaki Desk   |   24 March 2018 8:43 AM GMT
ఎన్ని క్ష‌ణాలు వ‌స్తాయి బాసూ...
X
ఒక్క సినిమా హిట్ అయితే, అదే ఫార్మూలాతో వ‌రుస పెట్టి సినిమాలు రావ‌డం ఇండ‌స్ట్రీలో చాలా కామ‌న్‌. ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యాక‌, తెలుగులో ఫ్యాక్ష‌న్ సినిమాల హ‌వా బాగా పెరిగింది. ‘గీతాంజ‌లి’ సినిమా త‌ర్వాత హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజ‌యంతో బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు తీసేందుకు ప్ర‌య‌త్నాలు పెరిగిపోయాయి. అయితే బాలీవుడ్‌లో ఒకే సినిమాను కాపీ కొట్టి, రెండు సినిమాలు వ‌స్తుండ‌డం ఆశ్చ‌ర్యం.

అడ‌వి శేషు, అదా శ‌ర్మ‌, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ‘క్ష‌ణం’ సినిమా మంచి విజ‌యం సొంతం చేసుకుంది. స‌రికొత్త క‌థ‌నంతో హాలీవుడ్ రేంజ్‌కి త‌క్కువ కాకుండా అడ‌వీ శేషు రాసిన క‌థ‌, అంద‌రినీ అద్భుతంగా ఆకట్టుకుంది. తెలుగులో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్ల‌ర్ మూవీగా నిలిచింది. దాంతో ఈ సినిమా క‌థ‌ను ఆధారం చేసుకుని త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఇప్ప‌టికే అధికారిక రిమేక్ చిత్రాలు సిద్ధ‌మ‌య్యాయి. త‌మిళంలో ఇప్పటికే స‌త్య పేరుతో వ‌చ్చిన క్ష‌ణం రీమేక్ మంచి విజ‌యం సాధించింది. హిందీలో టైగ‌ర్ ఫ్రాఫ్ హీరోగా ‘భాగీ 2’ పేరుతో తెర‌కెక్కి, వ‌చ్చే వారం విడుద‌ల‌కు రెడీ అవుతోంది. అయితే తెలుగులోని స‌హ‌జ‌త్వానికి దూరంగా భారీ యాక్ష‌న్ ఫైట్స్ స‌న్నివేశాల‌తో క్ష‌ణం సినిమాను చెడ‌గొట్టిన‌ట్టుగా అనిపిస్తోంది భాగీ 2 ట్రైల‌ర్‌. ఇప్పుడు ట‌బూ, మ‌నోజ్ బాజ్‌పాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వస్తున్న ‘మిస్సింగ్‌’ ట్రైల‌ర్ క‌థ కూడా క్ష‌ణం సినిమానే గుర్తుకుతెస్తోంది.

ట్రైల‌ర్ చూసిన తెలుగు వాళ్లంద‌రూ ఎన్ని క్ష‌ణాలు తీస్తారో అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మిస్సింగ్ సినిమా కూడా భాగీ 2 విడుద‌ల‌యిన త‌ర్వాతి వారం అంటే ఏప్రిల్ 6న విడుద‌ల అవుతుండ‌డం విశేషం. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ క్ష‌ణం రీమేక్ థ్రిల్ చేస్తుందో చూడాలి.

ట్రైలర్ చూడటానికి క్లిక్ చేయండి