Begin typing your search above and press return to search.

ఇంటికొచ్చిన మిస్సింగ్ మోడల్

By:  Tupaki Desk   |   30 May 2017 4:54 AM GMT
ఇంటికొచ్చిన మిస్సింగ్ మోడల్
X
మోడల్ గానమ్ నాయర్ మిస్సింగ్ కేసు గత కొన్ని రోజులుగా సెన్సేషన్ సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. ఓ సెలబ్రిటీ నాలుగు రోజులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆన్ లైన్ లో కూడా విపరీతమైన ప్రచారం ఈ అంశానికి లభించింది.

చెన్నై మహానగరంలో విరుగంబాక్కం నుంచి నుంగంబాక్కంకు తన స్కూటర్ పై బయల్దేరిన 28 ఏళ్ల గానమ్.. ఆఫీస్ కి చేరుకోకపోవడం.. ఈ కేసు మిస్టరీగా మారడం.. పెను సంచలనం అయింది. ఆమె బైక్ నెంబర్.. బంధువుల సెల్ నెంబర్స్ తో సహా.. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రచారం చేశారు. అయితే.. ఇప్పుడీ మోడల్ తిరిగి ఇంటికి చేరుకుంది. తనంతట తానే ఇలా వచ్చేసిందని కొందరు చెబుతున్నారు. అయితే.. ఇంటికి వచ్చేసినా ఈమె ఇంకా డిప్రెషన్ లోనే ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితిలోనే ఆమె కనిపిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.

నేటివ్ గా ఢిల్లీ వాసి అయినా.. గానమ్ నాయర్ ఇప్పుడు చెన్నైలోని తమ బంధువుల ఇంట్లో.. తండ్రితో కలిసి ఉంటోంది. మే 26న ఆఫీస్ కి వెళుతూ మిస్ అయిన ఈమె.. మే 29న తిరిగి ఇంటికి చేరుకుంది. కానీ ఈ 4 రోజులు ఏం జరిగింది.. అసలు ఎలా మిస్ అయింది.. ఆమె డిప్రెషన్ కు కారణం ఏంటి.. వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నై పోలీసులు చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/