Begin typing your search above and press return to search.

ఈ శ్రద్ధ మిస్ యూనివర్స్ అవుతుందా?

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:03 AM GMT
ఈ శ్రద్ధ మిస్ యూనివర్స్ అవుతుందా?
X
మళ్లీ 17 సంవత్సరాల తర్వాత ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచిన తర్వాత.. ఈ ఏడాది మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరికొన్ని రోజుల్లోనే విశ్వ సుందరి పోటీలు జరగనున్నాయి. నవంబర్ 26న మిస్ యూనివర్స్ 2017 పోటీలను.. యూఎస్ఏ లోని లాస్ వెగాస్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలలో ఇండియా తరఫున అందాల భామ శ్రద్ధా శశిధర్ పోటీ పడుతోంది. ఇప్పటికే యమహా ఫాసిన్ మిస్ దివా 2017గా గెలుపొందిన ఈ శ్రద్ధ.. నేటివ్ గా చెన్నై భామ. నాశిక్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న ఈ బ్యూటీ.. ముంబైలోని సోఫియా కాలేజ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పలు అందాల పోటీలలో విజేతగా నిలిచిన శ్రద్ధా శశిధర్ కు.. మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటారు సన్నిహితులు.

1996.. సెప్టెంబర్ 3న జన్మించిన శ్రద్ధా శశిధర్ కు.. ప్రస్తుతం 21 సంవత్సరాల వయసు. అందంతో పాటు అద్భుతమైన తెలివితేటలు కూడా ఈ బ్యుూూటీ సొంతం. అంతేకాదు.. క్రీడల పట్ల కూడా విపరీతమైన ఇష్టం ప్రదర్శిస్తుంది. స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. అడ్వెంచర్స్.. మ్యూజిక్ హాబీలు కాగా.. ప్రయాణాలు అంటే కూడా విపరీతమైన పిచ్చి. ఇప్పుడీ సుందరి మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇండియాకి తెచ్చేయాలని.. బ్యూటీ లవర్స్ తెగ కోరుకుంటున్నారు.