Begin typing your search above and press return to search.

కొత్తం అందాన్ని దించుతున్న గోపీచంద్

By:  Tupaki Desk   |   24 April 2017 6:38 PM GMT
కొత్తం అందాన్ని దించుతున్న గోపీచంద్
X
టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు పక్క భాషల సుందరాంగులను తీసుకురావడం అంటే మహా ఇష్టం. ఇప్పటికే బోలెడంత మంది హీరోయిన్స్ వచ్చేసినా.. ఎప్పటికప్పుడు కొత్త అందాలను తీసుకు వచ్చేందుకు మహా ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు మాస్ హీరో గోపీచంద్ ఓ అందాల భామను టాలీవుడ్ కు తీసుకొచ్చేస్తున్నాడు.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న మూవీ గౌతమ్ నంద. ఇందులో 2015 మిస్ ఇండియా యూనివర్స్ రన్నరప్ నటాషా అస్సాది నటిస్తోంది. గోపీచంద్ కు సెక్రటరీ ఈ మూవీలో నటాషా కనిపించనుంది. మూవీ అంతా కనిపించే ఈ రోల్ లో అందాలు చిందించనుంది నటాషా. మోడలింగ్ లో బోలెడంత గుర్తింపు ఉన్న ఈ భామ.. తొలిసారిగా గౌతమ్ నంద మూవీ ద్వారా తెరంగేట్రం చేస్తోంది. అమ్మాయిల అందాలను ప్రెజెంట్ చేయడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సంపత్ నంది.. మిస్ యూనివర్స్ రన్నరప్ నటాషా అందాన్ని కూడా బాగానే ఎగ్జిపిట్ చేయనున్నాడట.

గౌతమ్ నంద ఆకర్షణలలో నటాషా కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హన్సిక.. కేథరిన్ థ్రెసాలు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.