Begin typing your search above and press return to search.

ఈ సినిమా.. క్లాసిక్ అయ్యేలా ఉందే!

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:27 AM GMT
ఈ సినిమా.. క్లాసిక్ అయ్యేలా ఉందే!
X
బాలీవుడ్లో మనసుతో సినిమాలు తీసే దర్శకుల్లో రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా ఒకడు. రంగ్ దె బసంతి.. బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలే చెబుతాయి ఆయన స్థాయి ఏంటని. సినిమా సినిమాకు బాగా గ్యాప్ తీసుకుని.. వాటిన కళాఖండాల్లా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాడు రాకేష్. ఆయన నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘మిర్జియా’. సీనియర్ హీరో అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ ను హీరోగా.. తెలుగు ‘రేయ్’ సినిమాలో నటించిన సయామీ ఖేర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాకేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిర్మాత కూడా ఆయనే. ఇప్పటికే ఫస్ట్ పోస్టర్.. తొలి ట్రైలర్ ఈ సినిమా స్థాయి ఏంటో చూపించాయి.

దసరా కానుకగా అక్టోబరు 7న ‘మిర్జియా’ విడుదల కాబోతున్న నేపథ్యంలో కొత్తగా ఇంకో ట్రైలర్ వదిలాడు రాకేష్ మెహ్రా. ఈ విలక్షణ దర్శకుడు వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడనే అనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే. కథలో.. పాత్రల్లో ఉన్న ఇంటెన్సిటీ ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. విజువల్స్ అద్భుతంగా అనిపిస్తున్నాయి. హర్షవర్ధన్.. సయామీల నటన కూడా గొప్పగా ఉండేలా కనిపిస్తోంది. ఓ గాఢమైన ప్రేమకథకు రాకేష్ వెండితెర రూపం ఇచ్చినట్లున్నాడు. ఇది పంజాబ్ లో జరిగిన ఓ చారిత్రక నిజ జీవిత కథకు ముడిపెట్టి ఈ సినిమాను తీశాడట రాకేష్. ‘రంగ్ దె బసంతి’ తరహాలోనే చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ వెరైటీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసినట్లున్నాడు రాకేష్. చూస్తుంటే ఇదో క్లాసిక్ లాగా నిలిచిపోయేందుకు అవకాశముందనిపిస్తోంది. ఐతే ఇలాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనుకోండి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/