Begin typing your search above and press return to search.

మిక్కీకి బిజీ అయిపోయాడుగా..

By:  Tupaki Desk   |   11 Feb 2016 11:30 AM GMT
మిక్కీకి బిజీ అయిపోయాడుగా..
X
మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్ - మ్యూజికల్ హిట్స్ బాగానే ఉన్నా.. భారీ సినిమాలను పట్టుకోవడంలో కానీ, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కానీ ఎప్పుడూ వెనకాలే ఉంటాడు. కానీ ఈ ఏడాది మిక్కీ ఫేట్ మారిపోతున్నట్లు కనిపిస్తోంది. చేతి నిండా పెద్ద పెద్ద ఆఫర్లతో మిక్కీ జె మేయర్ ఫుల్లు బిజీ అయిపోతున్నాడు.

ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ బాగా కాస్ట్ లీ అనే టాక్ ఉంది. అలాగే థమన్ సంగీతం బాగా రొటీన్ అయిపోయి, బోర్ కొట్టేస్తోంది. మళ్లీ మళ్లీ అవే ట్యూన్స్ తో థమన్ విసిగిస్తున్నాడని అంటూ ఉంటారు. ఇక మరో సంగీత దర్శకుడు అనిరుధ్ అయితే బీప్ సాంగ్ వివాదం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో వరుసగా పెద్ద సినిమాల ఆఫర్స్ మిక్కీ తలుపు తడుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీస్తున్న అ..ఆ.. చిత్రానికి అనిరుధ్ ప్లేస్ లో మిక్కీనే తీసుకున్నారు. సాధారణంగా తమన్ తో వరుసగా సినిమాలు చేసే మాస్ మహరాజ్ రవితేజ కూడా.. ఇప్పుడు స్టాండ్ మార్చేశాడు.

ఇప్పుడు రాబిన్ హుడ్ కోసం మిక్కీతో జత కట్టాడని తెలుస్తుండగా.. గత చిత్రం బెంగాల్ టైగర్ కు భీమ్స్ కి ఆఫర్ ఇచ్చాడు. వీటన్నిటికీ మించి.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం కు కూడా మిక్కీనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ ఏడాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్పాట్ కి మిక్కీ ఎసరు పెట్టేట్టుగానే ఉన్నాడనిపిస్తోంది కదూ.