Begin typing your search above and press return to search.

వర్మ హీరోయిన్.. అన్న-భర్త కూడా అదే

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:41 PM GMT
వర్మ హీరోయిన్.. అన్న-భర్త కూడా అదే
X
పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లను భారతీయ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలకు సన్నీ లియోన్ తెరదించేసింది. ఆరేడేళ్ల కిందట ఆమె తొలిసారి ఇండియాలో అడుగుపెట్టినపుడు అదోలా చూశారు కానీ.. తర్వాత ఆమె ఇక్కడే సెటిలై బాలీవుడ్ సినిమాలు చేస్తే వాటిని ఆదరించారు. ఇక్కడి హీరోయిన్ల మాదిరే ఆమెనూ ట్రీట్ చేశారు. ఈ కోవలోనే ఇప్పుడు మియా మాల్కోవా అనే మరో పోర్న్ స్టార్ ఇండియాలోకి అడుగుపెడుతోంది. రామ్ గోపాల్ వర్మ ఆమెతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే సినిమా తీసి త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.

దీంతో ఇప్పుడందరూ మియా మాల్కోవా బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే సన్నీ లాగే మియా భర్త సైతం పోర్న్ స్టారే. పోర్న్ ఇండస్ట్రీలో పరిచయం తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది మియా. ఇంకో విశేషం ఏంటంటే.. మియా సోదరుడు సైతం పోర్న్ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. తన తల్లికి కూడా తాను పోర్న్ ఇండస్ట్రీలో ఉండటం పట్ల అభ్యంతరం లేదని.. తాను నటించిన పోర్న్ సినిమాల్ని ఆమెతో కలిసి చూస్తానని.. ఈ సినిమాల కోసం ఆమె సహకారం కూడా తీసుకుంటానని మియా చెప్పడం గమనార్హం. పోర్న్ స్టార్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కలిసి ఆమె సొంత ప్రొడక్షన్లో పోర్న్ సినిమాలు చేసుకుంటోంది. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయితో వర్మ సినిమా తీశాడు. మరి సన్నీ లాగే మియా కూడా మున్ముందు ఇక్కడికే వచ్చి సెటిలైపోతుందేమో చూడాలి.