Begin typing your search above and press return to search.

వర్మ హీరోయిన్ మోడీని బీట్ చేసిందా?

By:  Tupaki Desk   |   23 Jan 2018 11:01 AM GMT
వర్మ హీరోయిన్ మోడీని బీట్ చేసిందా?
X
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడకపోతే మీడియాకు సగం పని తగ్గినట్లే. కానీ ఆయన నిశబ్ధంగా ఉన్నారంటే కూడా అదొక సెన్సేషనే. అయితే గత కొంత కాలంగా ట్విట్టర్ సెకండ్ ఇన్నింగ్స్ లో వర్మ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎదో ఒక విషయంపై స్పందిస్తున్నాడు. ముఖ్యంగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విషయంపై రోజుకి రెండు మూడు సార్లైనా తలచుకోనిది ఉండడం లేదు.

ప్రమోషన్స్ చేస్తున్నాడో లేక ఇంకేమైనా చేస్తున్నాడో గాని ట్విట్టర్ లోనే కాకుండా మీడియాలో వర్మ డిబేట్ లు పెడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాడు. ఇక ఈ రోజు వర్మ గూగుల్ స్టాటిస్టిక్స్ గ్రాఫ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేసింది గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేవారు కానీ ఈ సారి మియా మాల్కోవా క్రేజ్ ముందు మోడీ ర్యాంక్ తగ్గిందంటే అర్ధం చేసుకోవచ్చు ఆ సరికొత్త కంటెంట్ పై ఏ స్థాయిలో వైరల్ అవుతుందో.. ఇక మూడవ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు.

మొన్నటి వరకు వర్మ జి.ఎస్.టి ఎదో వైరల్ అవుతుందిలే అనుకున్నారు. కానీ వర్మ గూగుల్ స్టాట్స్ చుపించాక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వామ్మో.. ఏంది వర్మ ఇది అంటూ ఆశ్చర్యపోతున్నారు. వర్మ ఇచ్చిన డోస్ బాగా పనిచేసిందని తెలుస్తోంది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంటె ఇక జనవరి 26న విడుదల కాబోయే ఆ శృంగార సత్యం ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ స్టాట్స్ అసలు నిజమేనా??