Begin typing your search above and press return to search.

నానితో ఛాన్స్ అంత ఈజీ కాదంటోంది

By:  Tupaki Desk   |   6 Feb 2016 10:30 PM GMT
నానితో ఛాన్స్ అంత ఈజీ కాదంటోంది
X
మెహ్రీన్.. నాని లాంటి టాలెంటెడ్ హీరో పక్కన, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి క్రేజున్న సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న కొత్త భామ. మోడలింగ్ లో అడుగుపెట్టి.. కొన్ని ప్రకటనలతో పేరు తెచ్చుకున్న మెహ్రీన్.. హను రాఘవపూడి కళ్లల్లో పడి సినిమా ఛాన్స్ కొట్టేసింది. తొలి సినిమాగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు చేయడం చాలా ఆనందంగా ఉందన్న ఈ ముంబయి భామ.. ఈ అవకాశం అంత తేలిగ్గా ఏమీ దొరకలేదంటోంది. ‘‘నేను 35కు పైగా కమర్షియల్స్ చేశాను. నా ఫొటోలు ఎక్కడో చూసి హను ఆడిషన్స్ కు పిలిచారు. ఐతే రెండు రోజుల పాటు నాకు చాలా పరీక్షలు పెట్టారు. రకరకాల సన్నివేశాలు చెప్పి చేసి ూచూపించమన్నారు. అన్నింట్లో ఇంప్రెస్ చేశాకే నన్ను ఎంచుకున్నారు. నాని లాంటి టాలెంటెడ్ హీరో పక్కన మామూలుగా నటిస్తే కుదురుతుంతా’’ అని గడుసుగా ప్రశ్నించింది మెహ్రీన్.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మహాలక్ష్మి పాత్ర కోసం తాను చాలా హోంవర్క్ చేశానని.. ఆ పాత్రకు కాస్ట్యూమ్స్ అన్నీ తనే సెలక్ట్ చేసి తెచ్చుకున్నానని.. డైలాగులన్నీ బట్టి పట్టి డబ్బింగ్ విషయంలో ఏ తేడా రాకుండా చూసుకున్నానని చెప్పింది మెహ్రీన్. తొలి సినిమాలో పద్ధతైన పాత్రలోనే కనిపిస్తున్నప్పటికీ.. ఫ్యూచర్లో గ్లామర్ రోల్స్ చేయడానికి తనకే అభ్యంతరం లేదని, అలాంటి పాత్రలు చేయకుండా ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టమని చెప్పింది మెహ్రీన్. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడగ్గా.. రెండు ఆఫర్లు ఉన్నాయని, ఐతే కృష్ణగాడి వీర ప్రేమగాథ విడుదల తర్వాత నిర్ణయం తీసుంటానని చెప్పింది మెహ్రీన్.