Begin typing your search above and press return to search.

ప్రమోషన్లు కూడా మహాలక్ష్మి టైపులోనే

By:  Tupaki Desk   |   11 Feb 2016 1:30 PM GMT
ప్రమోషన్లు కూడా మహాలక్ష్మి టైపులోనే
X
ఈ శుక్రవారం తెలుగు తెరకు ఒక కొత్త హీరోయిన్‌ పరిచయం అవుతోంది. ఇప్పటివరకు గత మూడు నెలల్లో దాదాపు అరడజను కొత్త హీరోయిన్లు వచ్చుంటారు. వారిలో ఒక్కరు కూడా హిట్టవ్వలేదు. సాయేషా సైగల్‌ - సోనారికా బడోరియా - పలక్‌ లల్వానీ.. ఇలా చాలామంది సందడి చేశారు. ఇక రేపు ముంబయ్‌ మోడల్‌ మెహరీన్‌ కౌర్‌ పీర్జాదా వంతు వస్తోంది.

''కృష్ణగాడి వీర ప్రేమ గాధ'' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న మెహ్రీన్‌ పై చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే హను రాఘవపుడి డైరక్షన్‌ లో అందాల రాక్షసి గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఒక రేంజులో ఇంప్రెస్‌ చేసింది. ఇప్పుడు కూడా మన గురుడు ఒక 200 ప్రొఫైల్స్‌ చెక్‌ చేసి మరీ ఈమెను ఎంచుకున్నాడు కాబట్టి.. ఖచ్చితంగా ఒక పవర్‌ హౌస్‌ పెర్ఫార్మర్‌ అనే అందరి అంచనా.

అందుకే సినిమాలో మెహ్రీన్‌ చేస్తున్న ఫీల్‌ పోకూడదని అనుకుంట.. మహాలక్ష్మి క్యారెక్టర్‌ కు దగ్గర్లోనే ఈమె ప్రమోషన్లకు వేసుకొచ్చే కాస్ట్యూమ్స్‌ కూడా ఉంటున్నాయి. చూడీదారులూ.. లంగా వోణీల్లోనే.. అమ్మడు ప్రమోట్‌ చేస్తోంది. చూద్దాం ఎంతవరకు ఇంప్రెస్‌ చేస్తుందో మరి. వుయ్‌ ఆర్‌ రెడీ మెహ్రీన్‌!!