Begin typing your search above and press return to search.

మెహ్రీన్ ఒక్కత్తే తెగ కష్టపడుతోందే

By:  Tupaki Desk   |   17 Oct 2017 1:30 PM GMT
మెహ్రీన్ ఒక్కత్తే తెగ కష్టపడుతోందే
X

రేపే 'రాజా ది గ్రేట్' సినిమా రిలీజ్. ఈ సినిమాలో రవితేజ ఒక అంధుడి పాత్రను పోషిస్తుండగా.. హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం జనాలు ధియేటర్లకు ఆటోమ్యాటిక్ గా వచ్చేస్తారులే అని ఫీలైన దిల్ రాజు.. ప్రమోషన్లను బాగా తగ్గించేసిన మాట వాస్తవం.

అరాకొరగా రాజా ది గ్రేట్ సినిమాను ప్రమోట్ చేస్తున్న రాజు గారి సంగతి అటుంచితే.. అసలు ఈ సినిమా నుండి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాదా మాత్రం తనకు తానే ప్రమోషన్లను చేసుకుంటోంది. ముందు నుండీ సొంత పి.ఆర్. టీమ్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ఇష్టపడే మెహ్రీన్.. ఇప్పుడు కూడా అసలు రోజూ ఏదో ఒక చోట ఏదో ఒక కార్యక్రమానికి వస్తూనే ఉంది. మిగతా టీమ్ అంతా వచ్చినా రాకపోయినా కూడా ఈ పంజాబి బ్యూటి మాత్రం తన హాజరు వేయించుకుంటోంది. పైగా చాలా గ్లామరస్ గా ఎంట్రీలు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చూస్తుంటే సినిమాను ప్రమోట్ చేయడానికి ఈమె ఒక్కత్తే ఇంక కష్టపడుతోందే అనిపించక మానదు.

మోడిలింగ్ తో తన కెరియర్ ను మొదలెట్టిన ఈ 21 ఏళ్ల సుందరి.. ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమా తరువాత జవాన్.. కేరాఫ్‌ సూర్య వంటి సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. చూద్దాం ఈమె కష్టం తాలూకు రిజల్ట్ రేపు ధియేటర్లలో ఎలా ఉండబోతుందో.