మెహ్రీన్ ని సాగనంపేస్తున్నారే..

Fri Apr 21 2017 11:21:38 GMT+0530 (IST)

కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీతో మెహ్రీన్ కౌర్ పీర్జాడ.. సినీ అరంగేంట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ఫిలౌరీలో చోటు సంపాదించి.. ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సులున్న భామ అనిపించేసుకుంది. తెలుగు తమిళ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ స్పీడ్ చూపిస్తున్న ఈ భామకు ఇప్పుడు సడెన్ బ్రేక్స్ పడుతున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న మూవీ మెహ్రీన్  హీరోయిన్ అని గతంలో చెప్పారు. అయితే.. ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి ఈమెను తప్పించేశారు. 'మెహ్రీన్ పీర్జాడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. అందుకే ఆమె స్థానంలో వేరే వారిని తీసుకోవాలని చూస్తున్నాం' అంటున్నారు. అయితే.. కెరీర్ ఇంకా తొలినాళ్లలోనే ఉన్న హీరోయిన్ కి.. డేట్స్ సమస్య అంటే నమ్మే విషయం కాదు.. అలాగే అసలు కారణం కూడా బయటకు చెప్పలేదు. మెహ్రీన్ స్థానంలో అఖిల్ భామ సాయేషా సైగల్.. మలయాళీ కుట్టి అను ఇమాన్యుయేల్ లలో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారట.

అలాగే అల్లు శిరీష్ మూవీలో మెహ్రీన్ ను ఓ హీరోయిన్ గా అనుకున్నారు. ఆ సినిమా ఛాన్స్ కూడా ఈమెకు తప్పిపోయింది. వరుసగా మెహ్రీన్ కౌర్ పీర్జాడాను తప్పించడం వెనక కారణాలు ఏంటనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/