Begin typing your search above and press return to search.

కృష్ణగాడి హీరోయిన్.. గ్లామర్ కి రెడీ

By:  Tupaki Desk   |   6 Feb 2016 5:30 PM GMT
కృష్ణగాడి హీరోయిన్.. గ్లామర్ కి రెడీ
X
మరో వారంలో కృష్ణగాడి వీర ప్రేమగాధ అంటూ నేచురల్ స్టార్ నాని వచ్చేస్తున్నాడు. భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కృష్ణగాడి వీర ప్రేమగాధతో హీరోయిన్ గా పరచయమవుతోంది మెహ్రీన్. ఈనెల 12న మూవీ రిలీజ్ సందర్భంగా... బోలెడు హ్యాపీగా ఉంది ఈ భామ.

-ఈ మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది.?
నేనిప్పటివరకూ 35 యాడ్స్ చేశాను, నా ఫోటోలు, వీడియోలు చేసిన డైరెక్టర్ హను నన్ను కాంటాక్ట్ చేశారు. రెండు రోజుల పాటు కొన్ని సీన్లలో యాక్ట్ చేసిన తర్వాత అవి నచ్చి హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు.

- మీ పాత్ర గురించి చెప్పండి
రాయలసీమ అమ్మాయి మహాలక్ష్మిగా నటించాను. 15 సంవత్సరాల జర్నీని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు ఈ సినిమాలో.

- నానితో యాక్ట్ చేయడం గురించి..
అతను నాచురల్ స్టార్ గా అందరికీ తెలుసు, కానీ అతనితో నటిస్తున్నప్పుడే నాకు ఆ విషయం అర్ధమైంది. తన గురించి తనకు పూర్తిగా తెలుసు, ఎప్పుడూ బెస్ట్ అందించేందుకు ట్రై చేస్తాడు.

- ఈ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు
డైరెక్టర్ తో కలిసి డైలాగ్స్ చాలా ప్రాక్టీస్ చేశాను. మహాలక్ష్మిగా కనిపించేందుకు నేను నా సొంత కాస్ట్యూమ్స్ నే ఉపయోగించాను.

- ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి
అన్ని కమర్షియల్ ఎలిమెట్స్ ఉన్న ఓ లవ్ స్టోరీనే కృష్ణ గాడి వీర ప్రేమగాధ. ఓ పిరికివాడు తన ప్రేమను గెలిపించుకునేందుకు ఏం చేశాడన్నదే సినిమా

- గ్లామర్ రోల్స్ చేస్తారా?
యస్, ఎందుకు చేయకూడదు.. అన్ని రకాల పాత్రలు చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా

- మీ ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి?
ప్రస్తుతం నాకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నా వీలైనంత త్వరలో ఫైనల్ చేసేస్తాను