Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: న‌వ్వితే ముత్యాలు రాలును

By:  Tupaki Desk   |   2 Sep 2018 4:24 PM GMT
ఫోటో స్టోరీ: న‌వ్వితే ముత్యాలు రాలును
X
మెహ్రీన్ ఫీర్జ‌దా .. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. నాని - శ‌ర్వానంద్ - సందీప్ కిష‌న్‌ - సాయిధ‌ర‌మ్ - వ‌రుణ్ తేజ్ .. ఇలా ఈ భామ లైన‌ప్ అంతా కుర్ర‌ హీరోల‌తోనే. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `రాజా ది గ్రేట్` చిత్రంలో న‌టించింది. కెరీర్‌ లో మూడు హిట్లు ఉన్నా .. నాలుగైదు ప‌రాజ‌యాలు త‌న‌ని తాను చెక్ చేసుకునేందుకు ఛాన్సిచ్చాయి. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఆచితూచి నిర్ణ‌యం తీసుకునేలా చేశాయి.

ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ఎఫ్‌2 - దేవ‌ర‌కొండ స‌ర‌స‌న నోటా చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రిన్ని సినిమాలు అమ్మ‌డి క్యూలో ఉన్నాయి. ఎఫ్ 2 - ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అంటూ బోలెడంత ఎమోష‌న్‌ - కామెడీ పండించే పాత్ర‌లో ఛాన్స్ ద‌క్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. అనీల్ రావిపూడి మార్క్ సినిమా ఇది.

ఇదిగో మెహ్రీన్ ఈ న‌వ్వు చూస్తుంటే కుర్ర‌కారు గుండెల్లో ల‌బ్ డ‌బ్ పెరిగిపోవ‌డం ఖాయం. చ‌ల్ల‌గా వెన్న‌ల‌మ్మ‌లా హాయిగా న‌వ్వేస్తోంది. ఆ న‌వ్వు చూశాక ఎలాంటి టెన్ష‌న్లు అయినా వ‌దిలిపోవాల్సిందే. ఫ్యాన్స్ నుంచి ఆ న‌వ్వుకు కామెంట్లు వ‌చ్చి ప‌డ్డాయి. బ్యూటిఫుల్.. ఐ ల‌వ్ యు.. బ్యూటిఫుల్ స్మైల్‌.. ల‌వ్ యు రా.. అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేశారు. మొత్తానికి ఇలా న‌వ్వుతూ హాయిగా జీవించేయ‌డ‌మెలానో మెహ్రీన్‌ నే అడిగి తెలుసుకోవాలేమో!