Begin typing your search above and press return to search.

ఇండియాలో అందరూ వినే వాయిస్ ఈమెదే

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:44 AM GMT
ఇండియాలో అందరూ వినే వాయిస్ ఈమెదే
X
కొన్ని వాయిస్ లను నిరంతరం వింటుంటాం. కానీ ఆ వాయిస్ ఎవరిదో మాత్రం తెలియదు. మనం ఆ విషయాన్ని పట్టించుకోం కూడా. మన ఫోన్ల నుంచి కాల్స్ చేసినపుడు వినిపించే వాయిస్ లు అలాంటివే. మనం ఫోన్ చేసిన వ్యక్తి అవతల బిజీగా ఉన్నా.. లేదా ఫోన్ స్విచాఫ్ అయి ఉన్నా.. ‘‘‘ద సబ్ స్ర్కైబర్ యు హ్యావ్ కాల్డ్ ఈజ్ కరెంట్లీ అన్ ఎవైలబుల్.. ప్లీజ్ ట్రై ఎగైన్ లేటర్’’ అంటూ చక్కటి గొంతుతో ఒక వాయిస్ వినిపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇండియా ప్రతి ఒక్కరికీ ఈ వాయిస్ సుపరిచితమే. దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇదే వాయిస్ వినిపిస్తుంది. ఐతే ఆ వాయిస్ ఎవరిదన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు.

ఆ స్వీట్ వాయిస్ ఎవరిదో వెల్లడైంది. ఆమె పేరు మేఘనా ఎరండేని. మరాఠా అమ్మాయి. మనం తనను పట్టించుకోలేదు కానీ.. ఆమె అనేక రకాలుగా ఫేమస్. మరాఠీ సాహిత్యంలో ముంబయి యూనివర్సిటీ టాపర్ అయిన మేఘన.. డబ్బింగ్ స్పెషలిస్టు. ఎన్నో కార్టూన్ క్యారెక్టర్లకు కూడా డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. నింజా హట్టోరి పాత్రతో పాటు డిజ్జీ.. డోరెమాన్.. ఆఫీసర్ జెన్నీ.. ఇలా ఎన్నో క్యారెక్టర్లకు ఆమె వాయిస్ ఇచ్చింది. హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు కూడా పని చేసింది. హిందీలో డబ్ అయ్యే వేరే భాషల సినిమాలకు కూడా గొంతు అరువిచ్చింది. రజినీకాంత్ ‘లింగా’ మూవీ హిందీ వెర్షన్లో అనుష్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా మేఘనే కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/