Begin typing your search above and press return to search.

'మేఘా'ల్లో తేల్చేస్తున్న ముగ్ధ

By:  Tupaki Desk   |   15 Feb 2018 4:19 AM GMT
మేఘాల్లో తేల్చేస్తున్న ముగ్ధ
X
టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ మేఘా ఆకాష్. లై చిత్రంతో నితిన్ కి జోడీగా నటించిన ఈ భామకు.. ఆ మూవీ సక్సెస్ సాధించకపోయినా వరుస అవకాశాలు బాగానే వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మూడు తమిళ సినిమాల్లో నటించేస్తున్న ఈ బ్యూటీకి.. తెలుగులో నితిన్ తో 'ఛల్ మోహన్ రంగా'తో పాటుగా కొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయంటే.. ఈ అందమైన అతివ స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

మేఘా ఆకాష్ కు పెరుగుతున్న క్రేజ్.. ఆమెను మేగజైన్ కవర్ పేజ్ లకు కూడా చేర్చేసింది. రీసెంట్ గా ఉమెన్ ఎక్స్ క్లూజివ్ మ్యాగజైన్ కవర్ పై ఈమె చేసిన సందడ అంతా ఇంతా కాదు. వేలంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఈ ఎడిషన్ లోపలి పేజీల్లో కూడా ఈ ముగ్ధ బోలెడన్ని కబుర్లతో పాటు.. మెరిసే అందాలను చూపే అందమైన ఫోటోలకు కూడా పోజులు ఇచ్చింది. నీలం.. నలుపు.. ఎరుపు.. లేత గులాబీ.. ముదురు ఎరుపు.. ఇలా తన ఒంటికి ఆయా రంగులు ఎంత అద్భుతంగా నప్పుతాయో చూపించేసింది మేఘా ఆకాష్.

సహజంగా ఒక్కో భామకు ఒక్కో ఫేవరేట్ కలర్ ఉంటుంది. వారు ఆ రంగులు వేస్తే మరింత అద్భుతంగా కనిపిస్తారు. కానీ మేఘా ఆకాష్ మాత్రం ఏ రంగు దుస్తులను ధరించినా.. ఆ వస్త్రాలకే మరింత వన్నె తెచ్చేస్తోంద. అందటి అందాన్ని సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. త్వరలో గౌతమ్ మీనన్ మూవీతో తమిళ ప్రేక్షకులను.. నితిన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోతోంది.