నాని24 టైటిల్ ఎంత రఫ్ గా ఉందో!

Sat Feb 23 2019 21:00:06 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కానీ వాటిలో 'గ్యాంగ్ లీడర్' సినిమాకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  మాస్ హీరోయిజం పీక్స్ లో ఉండే సినిమా అది.  ఇప్పుడు ఆ సినిమా టైటిల్ పైనే #నాని24 టీమ్ కన్ను పడిందట.  ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు.  మైత్రీ మూవీమేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను రేపు నాని పుట్టినరోజున(ఫిబ్రవరి 24) ప్రకటించాలని చూస్తున్నారట.ఈ సినిమాలో నాని ఒక నవలా రచయిత పాత్రలో నటిస్తున్నాడట.  ఈ రచయిత జీవితం ఐదుమంది అందమైన యువతులతో ముడిపడి ఉంటుందట. మరి ఆ లేడీస్ గ్యాంగ్ కు లీడర్ గా ఉంటాడేమో తెలీదు గానీ ఈ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఇప్పటికే టైటిల్ ను లాక్ చేశారని సమాచారం.  రేపు అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందట.  సహజంగా విక్రమ్  కుమార్ సినిమాల టైటిల్స్ క్లాస్ టచ్ తో ఉంటాయి. కానీ ఇది మాత్రం ఫుల్ మాస్ సౌండింగ్ ఉండే టైటిల్.  

నానికి టైటిల్ సూట్ అవుతుంది కానీ ఈ టైటిల్ ను నాని వాడుకోవడం పై మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. టైటిల్ మాత్రం నాని-విక్రమ్ సినిమాపై అంచనాలను వెంటనే పెంచేదిగా ఉంది.  రేపటికల్లా ఈ టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.