Begin typing your search above and press return to search.

మెగా స్టయిలిష్‌ స్టార్.. ఉత్తుత్తిదే!!

By:  Tupaki Desk   |   28 March 2017 5:21 AM GMT
మెగా స్టయిలిష్‌ స్టార్.. ఉత్తుత్తిదే!!
X
ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కు పడట్లేదు. దాదాపు ప్రతీ మెగా ఈవెంట్లోనూ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ పిచ్చిపిచ్చిగా అరుస్తూ వక్తలను పవన్ అభిమానులను బాగా డిస్ట్రబ్ చేస్తుండటంతో.. అసలు పవన్ కళ్యాన్‌ గురించి ఎందుకు చెప్పాలి.. 'చెప్పను బ్రదర్' అంటూ వ్యాఖ్యానించాడు బన్నీ. దానితో కొందరు అభిమానులు బాగా ఫీలయ్యారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ 'అల్లు ఫ్యాన్స్' అంటూ ఒక కొత్త గ్రూపులు తెరలేపి మెగా కోటరీ నుండి దూరమైపోతున్నాడనే రూమర్ ఉంది. కాని అందులో నిజం లేదని ప్రూవ్ చేయడానికి.. మనోడు తన ట్యాగ్ ముందు ''మెగా'' యాడ్ చేసుకుని.. ''మెగా స్టయిలిష్‌ స్టార్'' అంటూ మారిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కాని ఈ టాక్ లో అస్సలు నిజం లేదంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే బన్నీ కొత్తగా 'మెగా' అని యాడ్ చేసుకుని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు.

అసలు ఈవెంట్ ఏదైనా కూడా మెగాస్టార్ చిరంజీవిపై అమితమైన ప్రేమ కురిపించేది కేవలం బన్నీ మాత్రమే అని అందరికీ తెలుసు. చిరంజీవి రోడ్డేస్తే మేం చక్కగా కార్లు నడుపుకుంటున్నాం అని కామెంట్ చేసి తన విధేయత చాటుకున్నాడు. అలాంటప్పుడు ఈ 'మెగా' ట్యాగ్ అవసరం ఏముంది. సో ఈ రూమర్లన్నీ ఉత్తుత్తివే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/