మెగా విదేశీ అభిమానం.. రచ్చ రంబోలా

Tue Jan 10 2017 10:40:45 GMT+0530 (IST)

తొమ్మిదేళ్ళ క్రిందట సినిమాలు వదిలి వెళ్లినా ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందంటే అది కేవలం మెగాస్టార్ కి మాత్రమే చెల్లుతుంది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు డై హార్డ్ చిరు ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మెచ్యూర్డ్ పొజిషన్ లో వుండడమే కాక మంచిగా స్థిరపడిన వయసువారే ఎక్కువ. అందులోనూ విదేశాలలో అయితే ఇంకా ఎక్కువ.

కాబట్టి వీరికి తమ యుక్త వయసులో చూపించుకోలేని అభిమానాన్ని వ్యక్తీకరించుకునే అవకాశం లభిస్తుంది. ఇంకేముంటుందిరచ్చ రచ్చే. అమెరికాలో ప్రసిద్ధిగాంచిన ఒమాహాలో చిరు ఫ్యాన్స్ అందరు దాదాపు ఒక 30 కాస్ట్లీ కార్లతో ర్యాలీ నిర్వహించారు. తమ అభిమానాన్ని మొదటిరోజు టిక్కెటుతో తీర్చుకోలేమని చూపించారు.

దీనిపై స్పెషల్ గా కట్ చేసి చిరు మూవీస్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జతకలిపిన వీడియో అందరికీ పాత స్మృతులను జ్ఞప్తికి తెస్తున్నాయి. చివర్లో అన్ని కార్లూ జత చేర్చి చిరు అని ఆంగ్ల అక్షరాలలో పేర్చిన తీరు అద్భుతమనే చెప్పాలి. సో బాస్ ఈజ్ బ్యాక్ అన్నమాటLike Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/