Begin typing your search above and press return to search.

ఓటిటి బిజినెస్‌ లోకి మెగా నిర్మాత

By:  Tupaki Desk   |   25 April 2019 7:07 AM GMT
ఓటిటి బిజినెస్‌ లోకి మెగా నిర్మాత
X
మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా మనం మారితేనే అభివృద్ది చెందగలం, రాబోయే కాలంలో రాబోతున్న టెక్నాలజీని మరియు అవసరాలను ముందుగానే తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు బాగా వస్తాయి. ఈ విషయాన్ని బాగా అలవాటు చేసుకున్న వ్యక్తి ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌. ఈయన ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓటిటి బిజినెస్‌ ప్రారంభం కాబోతుంది. ఓటిటి అంటే ఓవర్‌ ది టాప్‌ అని అర్ధం. ఈ సర్వీస్‌ ద్వారా కేబుల్‌, డిష్‌ లాంటివి లేకుండానే టీవీల్లో ఇంటర్నెట్‌ ద్వారా ఛానల్స్‌ మరియు మూవీ కంటెంట్‌ అందిస్తారు.

ఓటిటి ఇప్పటికే విదేశాల్లో కొనసాగుతున్న పద్దతి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారి ఈ విధానంలో ప్రసారాలు ఇచ్చేందుకు నిమ్మగడ్డ ప్రసాద్‌, మై హోమ్స్‌ అధినేత రామేశ్వరరావు మరియు అల్లు అరవింద్‌ లు సిద్దం అయ్యారు. దీని కోసం మై హోమ్స్‌ అధినేత రామేశ్వరరావు 70 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రం కొనసాగబోతున్న ఈ కొత్త వెంచర్‌ కోసం జూబ్లీ హిల్స్‌ లోని ఒక ఆఫీస్‌ కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే వచ్చిన అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ప్లిక్స్‌ లకు ఇది అడ్వాన్స్‌ గా చెప్పుకుంటున్నారు. ఇందులో గీతా ఆర్ట్స్‌ నుండి వచ్చిన, రాబోతున్న ఒరిజినల్స్‌ కంటెంట్‌ ను ప్రసారం చేస్తారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ గురించి జనాల్లో అవగాహణ లేకున్నా రాబోయే అయిదు సంవత్సరాల్లో ఓటిటి ద్వారానే ఎక్కువ శాతం మంది ప్రసారాలు కోరుకుంటారని, పెరిగిన ఛానెల్స్‌ రేట్లు మరియు ఇతరత్ర కారణాల వల్ల కేబుల్స్‌ మరియు డీటీహెచ్‌ లను వినియోగదారులు వదిలేసి ఈ కొత్త విధానంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ గతంలో మా టీవీని ఒక చిన్న వెంచర్‌ గా మొదలు పెట్టి ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడో తెల్సిందే. ఇప్పుడు ఆయనపై నమ్మకంతోనే మరోసారి అల్లు అరవింద్‌ మరియు రామేశ్వరరావు పెట్టుబడులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ బిజినెస్‌ కు సంబంధించి వారి నుండి అధికారిక ప్రటకన వచ్చే అవకాశం ఉంది.